సోషల్ మీడియా(social media) ప్రపంచంలో ప్రతి చిన్న విషయం ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. ఇటీవల ఇందులో సరదగా సాగే వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన క్రేజీ వీడియోస్(crazy videos) చూసేందుకు నెటిజన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ పెంపుడు జంతువులు సరదాగా గడిపే వీడియోలు చూసేందుకు చిన్నారులతోపాటు..

సోషల్ మీడియా(social media) ప్రపంచంలో ప్రతి చిన్న విషయం ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. ఇటీవల ఇందులో సరదగా సాగే వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన క్రేజీ వీడియోస్(crazy videos) చూసేందుకు నెటిజన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ పెంపుడు జంతువులు సరదాగా గడిపే వీడియోలు చూసేందుకు చిన్నారులతోపాటు.. పెద్దవారు ఇష్టపడుతున్నారు. కుక్కలు(dogs), పిల్లులు(cats) వంటి పెంపుడు జంతువులు తమ అల్లరి చేష్టలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాయి. ఇప్పటికే అనేక వీడియోస్ చూస్తుంటాం.. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా(Funny) రియాక్ట్ అవుతున్నారు.

నిజానికి.. కుక్కలు.. పిల్లలు శత్రువులుగా ఉంటాయి. ఒకదానికి మరొకటి ఎదురుపడితే ఇంక అంతే సంగతులు. పిల్లిని వేటాడం కుక్క పని.. దాని నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకోవడం పిల్లి పని. ఇవి రెండు పోట్లాడుకోవడం చాలాసార్లు చూస్తుంటాం. కానీ కుక్కపైనే దాడికి పాల్పడిన పిల్లిని ఎప్పుడైనా చూశారా ?.. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియోలో ఓ ఇంటి పెరట్లో ఓ కుక్క ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్న కుక్కపైకి ఓ పిల్లి అమాంతంపై పడిపోయింది. అంతేకాకుండా అటు ఇటు జంప్ చేస్తూ దానిని మరింత విసిగించింది. అయితే పిల్లి ఎంత విసిగిస్తూ.. దాడి చేస్తున్న కుక్క మాత్రం తిరిగి ఎదురు దాడి చేయకుండా అలాగే ఉండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. 40 వేలకు పైగా లైక్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. నిజమైన స్నేహమంటే ఇదే అని.. స్నేహితులు అంటే మీరే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫన్నీ వీడియోను మీరు చూసేయ్యండి.

Updated On 16 April 2023 12:51 AM GMT
Ehatv

Ehatv

Next Story