డైరెక్టర్ పరశురామ్- విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన సినిమా ‘గీత గోవిందం’. ఈ సినిమా విజయ్ కెరీర్ లో సెకండ్ బిగ్గెస్ట్ హిట్. ‘గీత గోవిందం’ తర్వాత ఈ రౌడీ బాయ్ కి సరైన హిట్ లేదు. నోటా, ట్యాక్సీవాల, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు విజయ్ కి నిరాశను చూపించాయి. అయితే రీసెంట్ గా రిలీజైన ‘లైగర్’ సినిమా డిజాస్టర్ అవడంతో విజయ్ గ్రాఫ్ కాస్త డౌన్ ఫాల్ అయిందనే చెప్పాలి. ఆ తర్వాత పూరి […]

డైరెక్టర్ పరశురామ్- విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన సినిమా ‘గీత గోవిందం’. ఈ సినిమా విజయ్ కెరీర్ లో సెకండ్ బిగ్గెస్ట్ హిట్. ‘గీత గోవిందం’ తర్వాత ఈ రౌడీ బాయ్ కి సరైన హిట్ లేదు. నోటా, ట్యాక్సీవాల, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు విజయ్ కి నిరాశను చూపించాయి. అయితే రీసెంట్ గా రిలీజైన ‘లైగర్’ సినిమా డిజాస్టర్ అవడంతో విజయ్ గ్రాఫ్ కాస్త డౌన్ ఫాల్ అయిందనే చెప్పాలి.

ఆ తర్వాత పూరి జగన్నాథ్ తో స్టార్టయిన ’జనగణమన‘ ప్రాజెక్ట్ ను ఆపేశాడు. ఇక శివ నిర్వణ దర్శకత్వంలో వస్తున్న ‘ఖుషి’ మూవీకి కూడా బ్రేక్ పడినట్టే అయింది. సమంత మయో సైటిస్ బారీన పడటంతో ఈ సినిమా ఆగింది. ఆ తర్వాత సమంత ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ పనుల్లో ఆమె బిజీగా ఉంది. ఇటు ‘గీత గోవిందం’ కాంబో రిపీట్ అవడంతో విజయ్ కు మంచి రోజులు వస్తాయేమో చూడాలి మరి.

డైరెక్టర్ పరశురామ్ తో సినిమా చేసేందుకు రౌడీ బాయ్ మళ్లీ రెడీ అయ్యాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ మూవీ ఇది. ఆదివారం ఈ సినిమా గురించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో విజయ్ కి హిట్ పడుతుందంటున్నారు రౌడీ బాయ్ ఫ్యాన్స్. పరశురామ్-విజయ్ కాంబోలో ‘గీత గోవిందం-2’ మూవీ రానుందని, ఆ మూవీని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుందంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే వీరిద్దరి మూవీకి ప్రొడ్యూసర్ గా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్, రిలీజ్ డేట్ తోపాటు మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ వివరాలపై ఇంకా క్లారిటీ లేదు.

Updated On 6 Feb 2023 5:38 AM GMT
Ehatv

Ehatv

Next Story