మధ్య వయస్కుడైన ఓ వ్యక్తి ఓ వింతతువును పెళ్లి చేసుకున్నాడు. విచిత్రమేమిటంటే ఆ అమ్మాయి అతడి కోడలి(Daughter-in-Law) కావడం. 45 ఏళ్ల ఆ వ్యక్తి కుమారుడు అర్ధాంతరంగా కన్నుమూశాడు. కోడలు ఒంటరిదయ్యింది. ఆమెకు ముందు వెనుకా ఎవరూ లేరు.

మధ్య వయస్కుడైన ఓ వ్యక్తి ఓ వింతతువును పెళ్లి చేసుకున్నాడు. విచిత్రమేమిటంటే ఆ అమ్మాయి అతడి కోడలి(Daughter-in-Law) కావడం. 45 ఏళ్ల ఆ వ్యక్తి కుమారుడు అర్ధాంతరంగా కన్నుమూశాడు. కోడలు ఒంటరిదయ్యింది. ఆమెకు ముందు వెనుకా ఎవరూ లేరు. విధవరాలైన కొడుకు భార్యను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆ వ్యక్తి. ఇందుకు పాతికేళ్ల ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది. ఇద్దరూ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య వయసులో 20 ఏళ్ల తేడా ఉంది. వీరిద్దరూ గుడిలో పెళ్లి చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కొంతమంది రిపోర్టర్లు(Reporters) (వారు రిపోర్టర్లో కాదో తెలియదు) పెళ్లి గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు.

ఓ రకంగా మామను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. తమ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నామని ఇద్దరూ చెబుతున్నా వారు వదల్లేదు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు తలో రకంగా స్పందించారు. ఈ పెళ్లిని చాలా మంది సమర్థించారు. 'వయసులో తేడా ఉంటే ఏమిటీ, ఇద్దరూ మేజర్లే. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇందులో తప్పుపట్టాల్సిన అవసరం లేదు' అని కొందరు కామెంట్‌ చేశారు. వారిద్దరూ ఇష్టప్రకారం పెళ్లి చేసుకుంటే ఆ విలేకరులకు వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదంటున్నారు మరికొందరు. వారిని ఇబ్బంది పెట్టిన ఆ విలేకరులకు బుద్ధి చెప్పాలని, వారిపై కేసు పెట్టాలని ఇంకొందరు అన్నారు. మొత్తంగా పెళ్లికి మెజారిటీ పబ్లిక్‌ మద్దతు ఇచ్చారు.

Updated On 12 May 2023 12:11 AM GMT
Ehatv

Ehatv

Next Story