ఎలుకను(Rat) చంపిన నిందితుడిపై ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌(Uttar pradesh) బదౌన్ పోలీసులు 30 పేజీల ఛార్జిషీటును(Charge sheet) కోర్టులో(Court) దాఖలు చేశారు. నవంబర్ 25, 2022 న, మనోజ్ ఎలుకను రాయికి కట్టి కాలువలోకి విసిరాడని, దాని వల్ల అది ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు.

ఎలుకను(Rat) చంపిన నిందితుడిపై ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌(Uttar pradesh) బదౌన్ పోలీసులు 30 పేజీల ఛార్జిషీటును(Charge sheet) కోర్టులో(Court) దాఖలు చేశారు. నవంబర్ 25, 2022 న, మనోజ్ ఎలుకను రాయికి కట్టి కాలువలోకి విసిరాడని, దాని వల్ల అది ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు. దీన్ని సోమవారం కోర్టు ఆమోదించింది. ఇప్పుడు ఆ కేసు కోర్టులో నడుస్తుంది. ఎలుక మృతిపై చార్జిషీట్ దాఖలు చేయడం దేశంలో ఇదే మొదటిసారి.

బదౌన్(Badaun) ఇన్‌స్పెక్టర్ రాజేష్ యాదవ్(Rajashekar Yadav) తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. పోస్ట్‌మార్టం నివేదికలో జంతు హింసగా తేలింది. కాబ‌ట్టి నిందితుడు మనోజ్‌పై ఛార్జ్ షీట్ దాఖలు చేయబడింది. మనోజ్ బదౌన్ నివాసి. 25వ తేదీ నవంబర్ 2022న మ‌నోజ్‌ ఎలుక తోకకు రాయిని కట్టి కాలువలో ముంచి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. జంతు ప్రేమికుడు వికేంద్ర మనోజ్ చ‌ర్య‌ను వ్యతిరేకించాడు. మనోజ్ ఎలుకను చంపిన‌ వీడియోను వికేంద్ర ద‌గ్గ‌ర ఉంది.

మనోజ్‌పై వికేంద్ర ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. నిందితుడు మనోజ్‌పై పోలీసులు సెక్షన్-11 (జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం), సెక్షన్-429 (ఒక జంతువును చంపినా లేదా అంగవైకల్యం పాలుచేసినా విధించే సెక్షన్) ల కింద కేసు న‌మోదుచేశారు. కేసులో నేరం రుజువైతే.. 5 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ ఉండవచ్చు. జంతు ప్రేమికుడు వికేంద్ర డ్రెయిన్ నుంచి ఎలుక మృతదేహాన్ని బయటకు తీశాడు. అనంతరం బరేలీలో పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు.

బరేలీ ఐవిఐఆర్‌కు చెందిన డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ పవన్ కుమార్ ఎలుక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఊపిరాడకపోవడమే మరణానికి కారణమని తెలిపారు. పోలీసులు మనోజ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనోజ్ బెయిల్‌పై బయట ఉన్నాడు. బరేలీ ఐవిఐఆర్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కెపి సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎలుక ఊపిరితిత్తులు చెడిపోయి, వాపు కూడా ఉన్నట్లు గుర్తించామ‌ని తెలిపారు. కాలేయంలో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎలుక ఊపిరాడక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

అయితే ఎలుకను చంపి తాను ఎలాంటి తప్పు చేయలేదని నిందితుడు మనోజ్ చెబుతున్నాడు. ఎలుక నాకు హాని చేస్తుంది. ఎలుకలను చంపితే చర్యలు తీసుకుంటే మేకలు, కోడిగుడ్లను వధించినా కేసు పెట్టాలన్నాడు. అనంత‌రం క్షమాపణలు కూడా చెప్పాడు.

Updated On 12 April 2023 12:31 AM GMT
Ehatv

Ehatv

Next Story