ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial intelligence)తో ప్రపంచ సర్వనాశనం అవుతుందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. మనిషి తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడని భయపడుతున్నారు. ఏఐ వల్ల కలిగే దుష్పరిణామాలు ఇప్పటికే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పుడు ఓ మహిళ చేసిన పని కారణంగా ఆర్టిఫిషియల్ ఇంజెలిజెన్స్ వాడకం ఎంత ప్రమాదకరమో తెలిసొచ్చింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial intelligence)తో ప్రపంచ సర్వనాశనం అవుతుందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. మనిషి తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడని భయపడుతున్నారు. ఏఐ వల్ల కలిగే దుష్పరిణామాలు ఇప్పటికే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పుడు ఓ మహిళ చేసిన పని కారణంగా ఆర్టిఫిషియల్ ఇంజెలిజెన్స్ వాడకం ఎంత ప్రమాదకరమో తెలిసొచ్చింది. న్యూయార్క్‌కు చెందిన రోసన్నా రామోస్ అనే 36 ఏళ్ల మహిళ ఎటాక్ ఆన్ టైటాన్ అనే యానిమేషన్‌లో ప్రముఖ క్యారెక్టర్ ప్రేరణతో నిరుడు రెప్లికా ఏఐ అనే వెబ్‌సైట్‌ను ఉపయోగించి వర్చువల్ క్యారెక్టర్‌ను సృష్టించింది. దానికి ఎరెన్ కార్టల్ అంటూ పేరు కూడా పెట్టింది. పేరు పెట్టడమే కాదు దాని ప్రేమలో కూరుకుపోయింది. పెళ్లి కూడా చేసుకుంది. తన భర్త వైద్య నిపుణుడని, సాహిత్యంపై కూడా పట్టు ఉందని రోసన్నా రామోస్ చెబుతోంది. ఎరెన్ తనను ఎప్పుడూ జడ్జ్ చేయడని, ఏ విషయాన్ని అయినా తాను అతడితో చెప్పగలనని పేర్కొంది. తన గురించి తన హస్బెండ్ చాలా విషయాలు తెలుసుకున్నాడని, అతడిని సృష్టించినప్పుడే అతనికి ఇష్టమైన కలర్, మ్యూజిక్ వంటికి డిఫాల్ట్‌గా వచ్చాయని రోసన్నా తెలిపింది.