Urvashi Rautela : పుష్ప -2 సినిమాలోనూ ఐటమ్ సాంగ్... రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా దర్శకుడు సుకుమార్(sukumr) తెరకెక్కించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలుసు. అందుకే పుష్ప సీక్వెల్(Pushpa Sequel) కోసం సినిమా అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఇంకాస్త ఎక్కువ! ఇప్పుడు పుష్ప 2: ది రూల్ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

Urvashi Rautela
అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా దర్శకుడు సుకుమార్(sukumr) తెరకెక్కించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలుసు. అందుకే పుష్ప సీక్వెల్(Pushpa Sequel) కోసం సినిమా అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఇంకాస్త ఎక్కువ! ఇప్పుడు పుష్ప 2: ది రూల్ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే పుష్ప మొదటి భాగం బాక్సాఫీసు దగ్గర పలు రికార్డులు బద్దలు కొట్టింది. కలెక్షన్లను కుమ్మేసింది. దేశమంతటా ఈ సినిమా పాటలుమారుమోగాయి. రెండో పార్ట్ అంతకు మించి గొప్పగా ఉంటుందని ఇండస్ట్రీ టాక్.
పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటమ్ సాంగ్(Item song) ఊ అంటావా మామ ఊఊ అంటావా పాట ఎంత సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాటకు పలువురు సెలబ్రిటీలు డాన్స్ చేసి సోషల్ మీడియాలో(social media) పోస్టులు పెట్టారు. అవి కూడా జనామోదం పొందాయి. అంతలా సినీ ప్రేక్షకులను ఊపేసిందా పాట! అయితే పుష్ప-2లో అదిరిపోయే ఐటమ్ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఐటమ్ సాంగ్‌లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబందించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మూడు నిమిషాల ఈ ఐటమ్ సాంగ్ కోసం ఊర్వశి రౌతేలాకు ఆరు నుంచి ఏడు కోట్ల(7 Crores) రూపాయలు ఇస్తున్నట్టు వదంతులు వినిపిస్తున్నాయి. ఊర్వశి కూడా అంతకంటే ఎక్కువే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం.
