UP Bride Fires In Air:పెళ్లి వేడుకల్లో వధువు చేసిన హంగామా.. కట్ చేస్తే పెళ్లి కూతురు కోసం గాలిస్తున్న పోలీసులు.!
ఈ రోజుల్లో పెళ్లివేడుకలు సినిమాలను మించి ఉంటున్నాయి .పెళ్లి ఏర్పాట్లు ,వధువు వరులను స్టేజి పైకి తీసుకురావటం ,ప్రతి చిన్న విషయంలో కూడా వైవిధ్యాన్ని చూపించాలని రకరకాల హంగామాలు, ఆర్భాటాలు చేయటం మనం చూస్తూనే ఉంటాం .ఇలాంటి పెళ్లి వేడుకల్లో కొన్ని వీడియోలు నెట్టింట్లో బాగా వైరల్ అయ్యినవి చాలానే ఉన్నాయి . తాజాగా ఉత్తరప్రదేశ్(Uttar pradesh) లోని హత్రాస్ (hathras)లో పెళ్లి రిసెప్షన్ లో వధువు చేసిన హంగామాతో విషయం పోలీసులు వరకు వెళ్ళింది . పోలీసులు వధువుని వెతకటం మొదలు పెట్టారు .అసలు ఏమి జరిగిందంటే
ఈ రోజుల్లో పెళ్లివేడుకలు సినిమాలను మించి ఉంటున్నాయి .పెళ్లి ఏర్పాట్లు ,వధువు వరులను స్టేజి పైకి తీసుకురావటం ,ప్రతి చిన్న విషయంలో కూడా వైవిధ్యాన్ని చూపించాలని రకరకాల హంగామాలు, ఆర్భాటాలు చేయటం మనం చూస్తూనే ఉంటాం .ఇలాంటి పెళ్లి వేడుకల్లో కొన్ని వీడియోలు నెట్టింట్లో బాగా వైరల్ అయ్యినవి చాలానే ఉన్నాయి . తాజాగా ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని హత్రాస్ (hathras)లో పెళ్లి రిసెప్షన్ లో వధువు చేసిన హంగామాతో విషయం పోలీసులు వరకు వెళ్ళింది . పోలీసులు వధువుని వెతకటం మొదలు పెట్టారు .అసలు ఏమి జరిగిందంటే
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని హత్రాస్ (hathras)లో నూతన వధువు వరులు రిసెప్షన్ వేడుకల్లో సాంప్రదాయ పెళ్లి దుస్తుల్లో ఉన్నారు. పూలదండలు మార్చుకొని వచ్చిన బంధువుల ఆశీస్సులు తీసుకుంటున్నారు . పెళ్లి కూతురు బంధువు నల్లటి చొక్కాతో స్టేజి పైకి వచ్చాడు తన జేబులో నుండి లోడ్ చేసిన రివాల్వర్ ని బయటకు తీసాడు .దానిని వధువు చేతికి ఇవ్వగా ఆమె 5 సెకండ్లలో 4 రౌండ్ల కాల్పులు జరిపింది. వేడుకల్లో భాగంగా జరిపిన ఈ కాల్పుల వీడియో ఇంటర్నెట్ ద్వారా లీకైంది .పక్కన ఉన్న వరుడు మాత్రం బిక్కమొహంతో అలానే కూర్చున్నాడు .ఈ వీడియో ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయ్యింది .
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో ఇలా వేడుకల్లో కాల్పులు జరపడాన్ని నిషేదించారు . బహిరంగ ప్రదేశాలు ,మతపరమైన సమావేశాలు,వేడుకలు,ఉత్సవాలు వంటి ప్రదేశాల్లో కాల్పులు జరపటం శిక్షార్హం . అది చట్టపరంగా నేరం దీనికి 2ఏళ్ళ శిక్ష ,లక్షరూపాయల జరిమానా విధించటం జరుగుతుంది . ఈ వీడియో గురించిన సమాచారం పోలీసులకు తెలియటంతో పెళ్లి కూతురిని వెతికే పనిలో ఉన్నారు పోలీసులు .అలాగే ఆమెకు తుపాకీ ఇచ్చిన వ్యక్తి గురించి కూడా ఆరాతీయనున్నారు .