ఆ రెండు గ్రామాలలో కర్ఫ్యూ విధించారు అధికారులు. అంగన్‌ వాడీలు, పాఠశాలలు మూసేశారు. ఇందుకు కారణం తీవ్రమైన ఉష్ణోగ్రతలు కాదు.. పులి భయం.. ఉత్తరాఖండ్‌లోని రిఖానిఖాల్‌, ధూమాకోట్‌ తహసిల్‌ గ్రామాలలో ఇటీవల ఇద్దరు వ్యక్తులపై పులి దాడి చేసి చంపేసింది. అప్పట్నుంచి ఈ రెండు గ్రామాలు గజగజమని వణికిపోతున్నాయి. జనం బయటకు రావడానికి హడలిపోతున్నారు. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఆ రెండు గ్రామాలలో కర్ఫ్యూ విధించారు అధికారులు.

ఆ రెండు గ్రామాలలో కర్ఫ్యూ విధించారు అధికారులు. అంగన్‌ వాడీలు, పాఠశాలలు(school) మూసేశారు. ఇందుకు కారణం తీవ్రమైన ఉష్ణోగ్రతలు కాదు.. పులి(tiger) భయం.. ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని రిఖానిఖాల్‌(Rikhanikhal), ధూమాకోట్‌ తహసిల్‌(Dhumakot Tehsil) గ్రామాలలో ఇటీవల ఇద్దరు వ్యక్తులపై పులి దాడి చేసి చంపేసింది. అప్పట్నుంచి ఈ రెండు గ్రామాలు గజగజమని వణికిపోతున్నాయి. జనం బయటకు రావడానికి హడలిపోతున్నారు. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఆ రెండు గ్రామాలలో కర్ఫ్యూ విధించారు అధికారులు. అలాగే అంగన్‌వాడీలు, పాఠశాలలను ఏప్రిల్‌ 17 నుంచి ఏప్రిల్‌ 18 వరకు మూసివేయాలని జిల్లా మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులను జారీ చేసింది. ధుమాకోట్‌, రిఖానిఖాల్‌ తహసీల్దార్లను పులి ప్రభావిత ప్రాంతాల్లో క్యాంప్‌ చేసి పులి బారినపడే అవకాశం ఉన్న కుటుంబాలను, ఇళ్లను గుర్తించాలని సూచించింది.

Updated On 17 April 2023 6:01 AM GMT
Ehatv

Ehatv

Next Story