పెళ్లిళ్లు చాల రకాలుగా జరుగుతాయి .ఒక్కో సంప్రదాయంలో ,ఒక్కో ఆచారంలో ,వేరు వేరు రకాల్లో ,వింత సంప్రదాయాల్లో కూడా జరగడం మనం చూసే ఉంటాం . కానీ మనుషులు కుక్కలతో పెళ్లిచేసుకోవటం ఎక్కడైన విన్నారా ?అలాంటి వింత సంప్రదాయం ఒక గిరిజన తెగ సంప్రదాయం . ఆ విశేషాలేంటో చూద్దాం .

ఒరిస్సాలో (orissa)సోరో బ్లాక్‌లోని బంద్‌షాహి గ్రామంలోని హో తెగ గిరిజనులకు కుక్కలతో తమ పిల్లల పెళ్లిళ్లు చేసే వింత సంప్రదాయం ఉంది. ఈ ఆచారం వారికీ చాల ముఖ్యమైందని వారు భావిస్తారు . మంచువసింగ్(machuva singh) అనే వ్యక్తి తన కొడుకు తపన్ సింగ్‌కి (tapan singh)(11) ఏళ్ళ బాలుడికి వధువుగా ఒక కుక్కను ఇచ్చి వివాహం జరిపించాడు . అలాగే అదే సమయంలో మానస్ సింగ్ (manas singh)తన ఏడేళ్ల కుమార్తె లక్ష్మికి వరుడిగా 'కుక్క'ని ఇచ్చి వివాహం జరిపించారు . తమ పిల్లలు జీవితాల్లో ఎలాంటి చేదు జరగకూడదని నమ్ముతూ దిష్టి పోవాలని ఏ విధంగా చేస్తాం అని ఆ గిరిజనులు చెప్పడం జరిగింది . పిల్లలకి పై దంతాలు రావటం మొదలుపెట్టినప్పటి నుండి వివాహానికి కుక్కను వెతకటం మొదలు పెడతారట .. అలాగేకుక్కతో పెళ్లి అంటే ఏదో మాములుగా తంతు కనిచేస్తారు అనుకోకండి .ఈ పెళ్ళి చేయడానికి 5 గంటల సమయం పడుతుంది .పెళ్ళి అయ్యాక దగ్గర బంధువులందరికి ఘనంగా విందు భోజనాలు కూడా పెడతారు . ఇలా చేయటం వలన వారి పిల్లల పైన ఉండే చెడు దృష్టి అంత ఆ కుక్కకు ద్వారా పోతుందనేది వీరి మూఢ నమ్మకం.

Updated On 19 April 2023 4:26 AM GMT
rj sanju

rj sanju

Next Story