Crazy Stunt For YouTube Views : యూట్యూబ్ వ్యూవర్‌షిప్ కోసం విమానాన్నే కూల్చేశాడు
పైత్యం ప్రకోపిస్తే ఇదిగో ఇలాంటి పనులే చేయాలనిపిస్తుంది. యూ ట్యూబ్(Youtube) వీడియో వ్యూవర్‌షిప్ కోసం అమెరికాకు(america) చెందిన ట్రెవోర్ జాకబ్(Trevor Jacob) అనే ఓ వ్యక్తి ఏకంగా విమానాన్నే కూల్చివేశాడు. ట్రవోర్ జాకబ్ స్నో బోర్డ్ ప్లేయర్ కూడా! 2014లో రష్యాలోని(russai) సోచిలో జరిగిన వింటర్ ఒలింపిక్స్‌లో(Winter Olympics) పాల్గొన్నాడు కూడా.
పైత్యం ప్రకోపిస్తే ఇదిగో ఇలాంటి పనులే చేయాలనిపిస్తుంది. యూ ట్యూబ్(Youtube) వీడియో వ్యూవర్‌షిప్ కోసం అమెరికాకు(america) చెందిన ట్రెవోర్ జాకబ్(Trevor Jacob) అనే ఓ వ్యక్తి ఏకంగా విమానాన్నే కూల్చివేశాడు. ట్రవోర్ జాకబ్ స్నో బోర్డ్ ప్లేయర్ కూడా! 2014లో రష్యాలోని(russai) సోచిలో జరిగిన వింటర్ ఒలింపిక్స్‌లో(Winter Olympics) పాల్గొన్నాడు కూడా. అమెరికా తరఫున పోటీలో పాల్గొన్న జాకబ్ సెమీ ఫైనల్స్ వరకు వెళ్లాడు. కాకపోతే ఇతడు అనేక ఇంటర్నేషనల్ టోర్నమెంట్లలో మెడల్స్ సాధించాడు. అది వేరే విషయమనుకోండి.. ఇతడికి లక్ష మంది సబ్‌స్క్రైబర్లతో ఓ యూట్యూబ్ ఛానెల్(Youtube cannel) ఉంది. అందులో స్కైడైవింగ్(skydiving), ఏవియేషన్, స్నో బోర్డింగ్‌కు(snow boarding) సంబంధించిన వీడియోలు అప్‌లోడ్ చేస్తాడు.
2021 నవంబర్ 24న తన ఫ్రెండ్ చితాభస్మాన్ని వెదజల్లాలి అని చెప్పి లోంపోక్ విమానాశ్రయం నుంచి ఓ పాత సింగిల్ ఇంజిన్ లైట్ ఎయిర్‌క్రాఫ్ట్(aircraft) తీసుకున్నాడు. అందులో ఒంటరిగా ప్రయాణించాడు. ఆ విమానం లాస్ పాడ్రెస్ నేషనల్ పార్క్‌పై ఎగురుతుండగా అది కుప్పకూలింది. పారాచూట్ సాయంతో ట్రెవొర్ జాకబ్ చావు నుంచి తప్పించుకోగలిగాడు. చాలా మంది అది ప్రమాదమేనని అనుకున్నారు. ఈ ఘటన జరిగిన నెల తర్వాత అంటే 2021, డిసెంబర్ 24వ తేదీన తన యూట్యూబ్ ఛానెల్‌లో 'నేను విమానాన్ని కూల్చేశాను' (I Crashed My Airplane) అనే టైటిల్‌తో ఓ వీడియో పోస్టు చేశాడు జాకబ్.
ఇంజిన్‌లో సమస్యలు రావడంతో పారాచూట్ సాయంతో బయటకు దూకానని అందులో చెప్పుకొచ్చాడు. బయటకు దూకే సమయంలో అతడి చేతిలో సెల్ఫీ స్టిక్ ఉండటంతో అప్పుడే కొన్ని అనుమానాలు వచ్చాయి. పైగా విమానం లాస్ పాడ్రెస్ నేషనల్ పార్క్ కూలడాన్ని అతడు పూర్తిగా చిత్రీకరించాడు. విమానంలో పలు భాగాల్లో అమర్చిన కెమెరాల్లోంచి ప్రమాదాన్ని చిత్రీకరించాడు. తాను సురక్షితంగా బయటపడినందుకు సంతోషిస్తున్నాంటూ వీడియో చివర్లో కామెంట్ చేశాడు. తర్వాత విమానం శిథిలాల దగ్గరకు వెళ్లి వాటిని కూడా షూట్ చేశారు.
విమానానికి అమర్చిన కెమెరాల్లో డేటాను పూర్తిగా తీసుకున్నాడు. వీడియో అప్‌లోడ్ అయిన కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టింది. ఆ సమయంలో శకలాలు ఎక్కడ ఉన్నాయో తనకు తెలియదని ట్రెవొర్ జాకబ్ దర్యాప్తు బృందానికి చెప్పాడు. చెప్పిన తర్వాత తన ఫ్రెండ్‌తో కలిసి ఓ హెలికాఫ్టర్‌లో ప్రమాద స్థలానికి వెళ్లి విమాన శకలాలను అక్కడ్నుంచి తొలగించాడు. మరో చోటకు వాటిని తీసుకెళ్లి ధ్వంసం చేశాడు.
మిగిలిన కొన్ని భాగాలను ఎయిర్‌పోర్టు, ఇతర ప్రదేశాల వద్ద చెత్తలో పారేశాడు. ట్రెవొర్ జాకబ్ ఏదో దాస్తున్నాడని అనుమానం వచ్చింది దర్యాప్తు బృందానికి. అతడు కావాలనే ఈ ప్రమాదానికి పాల్పడ్డాడని తెలుసుకుంది. అతడు పారాచూట్‌తో లోంపోక్ విమానాశ్రయానికి వచ్చినట్లు కనుగొన్నారు. గట్టిగా నిలదీసేసరికి ట్రెవొర్ ఫెడరల్ దర్యాప్తు బృందం ఎదుట తప్పును అంగీకరించాడు. ఉద్దేశపూర్వంగానే విమానాన్ని కూల్చివేసి దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించానన్నాడు.