Sankranti Festival: సొంతూరి బాట పట్టిన పట్నం ప్రజలు..!
సంక్రాంతి (Sankranthi) పండగ సందర్భంగా హైదరాబాద్‌లో (Hyderabad) రెండు, మూడు రోజుల పాటు షాపింగ్ హడావిడి ఉంటుంది. ఎక్కడ చూసినా జనం షాపింగ్ చేస్తూ కనిపిస్తారు. సంక్రాంతికి రెండు, మూడు రోజుల ముందు నుంచే ప్రజలు సొంతూళ్ల బాట పడుతుంటారు.
సంక్రాంతి (Sankranthi) పండగ సందర్భంగా హైదరాబాద్‌లో (Hyderabad) రెండు, మూడు రోజుల పాటు షాపింగ్ హడావిడి ఉంటుంది. ఎక్కడ చూసినా జనం షాపింగ్ చేస్తూ కనిపిస్తారు. సంక్రాంతికి రెండు, మూడు రోజుల ముందు నుంచే ప్రజలు సొంతూళ్ల బాట పడుతుంటారు. పండగ సందర్భంగా మూడు, నాలుగు రోజుల్లో మాత్రం హైదరాబాద్ రోడ్లపై రయ్.. రయ్‌మని దూసుకెళ్లొచ్చు. పండగకు ముందు రెండు, మూడు రోజులు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. మియాపూర్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, హయత్‌నగర్ నుంచి విజయవాడ వరకు దాదాపు బంపర్ టు బంపర్ అన్నట్లు వాహనాలు వెళ్తుంటాయి. ట్రైన్, బస్సులు, సొంత కార్లలో వారివారి ఊర్లకు పయనమవుతుంటారు.
అయితే నేటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభమవుతున్న సందర్భంగా.. పల్లెబాట పట్టారు పట్నం వాసులు. వాహనాలన్నీ విజయవాడ వైపు అన్నట్లు వెళ్తున్నాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారి (Hyderabad Vijayawada National Hihg way) వాహనాలతో నిండిపోయింది. టోల్‌గేట్ల (Tollgates) వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. దీంతో వాహనాలను క్రమబద్దీకరిస్తూ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. పంతంగి (Panthangi) వద్ద టోల్‌గేట్ దాటేందుకు దాదాపు 15 నిమిషాల సమయం పడుతుంది. 10 బూత్‌ల ద్వారా వాహనాలను విజయవాడ మార్గంలో పంపిస్తున్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా సేఫ్‌గా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.