గబ్బిలం (bats)పేరు వినగానే మనకు ముందు గుర్తువచ్చేది ఇపుడు కరోనా నే . వుహాన్ (wuhan)నగరంలో పుట్టిన కరోనా మూలలకి కారణం గబ్బిలం అని తెలిశాక వాటిని చూడటానికి కూడా భయపడుతున్నం . అలాగే చాలామంది గబ్బిలాన్ని అశుభ శకునంగా కూడా భావిస్తుంటారు . కానీ మన భారతదేశంలోనే ఒక చోట గబ్బిలాలను గ్రామదేవతగా భావించి పూజించే సంప్రదాయం ఉంది .

మీరు విన్నది నిజమే! బీహారులో(Bihar) వైశాలి(vishali) జిల్లాలో సర్సాయి (sarsaayi)గ్రామంలో గబ్బిలాలకు(Bats) ఒక ప్రత్యేక ఆలయం(Bats Temple) ఉంది. గబ్బిలాలను గ్రామదేవతగా భావించి పూజలు కూడా నిర్వహిస్తారు . వైశాలి ఇక్కడి ప్రాంత ప్రజలు గబ్బిలాల్ని శుభానికి చిహ్నంగా భావిస్తారు . బీహార్‌లోని వైశాలి జిల్లా సర్సాయి గ్రామంలో వేల సంఖ్యలో గబ్బిలాలు ఉంటాయి . తమ గ్రామాన్ని గబ్బిలాలు కాపాడతాయని అక్కడ ప్రజల విశ్వాసం . గబ్బిలాలు వలన అక్కడ ఊరు పచ్చగా ,కళకళలాడుతూ ఉంటుందని అక్కడ ప్రజలు భావిస్తుంటారు . ఎవరి ఇంట్లో అయిన గబ్బిలాలు నివాసం ఉంటే వారింటికి శుభం జరుగబోతుందని ,సంపదకు లోటు ఉండదని నమ్ముతారు అక్కడ వారు . ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసేముందు గబ్బిలాలను పూజించటం వారి సంప్రదాయం .

ఈ గ్రామంలో గబ్బిలాలను చూసేందుకు చుట్టూ పక్కల పర్యాటకులు చాలామంది ఇక్కడకు వస్తారు .అక్కడ గబ్బిలాలు ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టవు . అలాగే ఊరిలో రాత్రి పూట కొత్త వ్యక్తులు ఎవరైనా గ్రామంలోకి వస్తే గబ్బిలాలు వారిని చూసి అరవటం మొదలుపెడతాయి .. దాంతో అక్కడివారు జాగ్రత్త పడతారు .ఇలా గబ్బిలాలు వారి గ్రామాన్ని రక్షిస్తాయి అనేది వారి నమ్మకం .

Updated On 21 April 2023 4:40 AM GMT
rj sanju

rj sanju

Next Story