ఇవాళ్టి రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. సంవత్సరంలో అతి తక్కవ పగటి సమయం(Solstice)ఉండే రోజు ఇదే! ప్రతి ఏడాది డిసెంబర్‌ 21వ తేదీన ఇలా పగటి సమయం తక్కువగా ఉంటుంది. రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. భూమి(Earth) తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి(Sun) చుట్టూ తిరిగే క్రమంలో ఓ ఆరు నెలలు ఉత్తరధ్రువంవైపుకు వంగి ఉంటుంది.

ఇవాళ్టి రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. సంవత్సరంలో అతి తక్కవ పగటి సమయం(Solstice)ఉండే రోజు ఇదే! ప్రతి ఏడాది డిసెంబర్‌ 21వ తేదీన ఇలా పగటి సమయం తక్కువగా ఉంటుంది. రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. భూమి(Earth) తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి(Sun) చుట్టూ తిరిగే క్రమంలో ఓ ఆరు నెలలు ఉత్తరధ్రువంవైపుకు వంగి ఉంటుంది. వేసవి అయానంతం జూన్‌ 21వ తేదీ నుంచి శీతల అయనాంతం డిసెంబర్‌ 21వ తేదీ వరకు ఇలా ఉంటుంది. తర్వాత ఆరు నెలలు దక్షిణ ధ్రువంవైపుకు(South pole) వంగి తిరుగుతుంది. అందుకే ఈ రోజు ఉత్తరార్థ గోళంలో ఉన్న మనకు పగలు చాలా తక్కువగా, దక్షిణార్థ గోళంలో ఉన్న దేశాలకు పగలు ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే భూమిపై కాలాలు, రుతువులు ఏర్పడ్డాయి. ఇది పగలూ రాత్రీలాగే సహజమైన మార్పు.

Updated On 21 Dec 2023 3:52 AM GMT
Ehatv

Ehatv

Next Story