గత 24 గంటల్లో దేశంలో 7,830 కొత్త కరోనా కేసులు (New Covid Cases)నమోదయ్యాయి. ఈ క్రమంలో 14 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. 7 నెలల తర్వాత, 7న్నర వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. ఆగస్టు 31న 7,946 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్‌ కేసుల(active Cases) సంఖ్య 40,215కి చేరింది. గతం లో సెప్టెంబర్ (September)23న దేశంలో 41,818 మంది చికిత్సపొందారు . కొత్త ఇన్‌ఫెక్షన్లతో కోవిడ్ -19 కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నిన్న , దేశంలో సుమారు 5,676 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.ఒక్క రోజులో 2000 కు పైగా కేసులు నమోదు అయ్యాయి . తాజాగా జాతీయ రాజధానిలో(Delhi) మరో రెండు కోవిడ్ మరణాలు నమోదయ్యాయి

గత 24 గంటల్లో దేశంలో 7,830 కొత్త కరోనా కేసులు (New Covid Cases)నమోదయ్యాయి. ఈ క్రమంలో 14 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. 7 నెలల తర్వాత, 7న్నర వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. ఆగస్టు 31న 7,946 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్‌ కేసుల(active Cases) సంఖ్య 40,215కి చేరింది. గతం లో సెప్టెంబర్ (September)23న దేశంలో 41,818 మంది చికిత్సపొందారు . కొత్త ఇన్‌ఫెక్షన్లతో కోవిడ్ -19 కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నిన్న , దేశంలో సుమారు 5,676 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.ఒక్క రోజులో 2000 కు పైగా కేసులు నమోదు అయ్యాయి . తాజాగా జాతీయ రాజధానిలో(Delhi) మరో రెండు కోవిడ్ మరణాలు నమోదయ్యాయి .

ప్రస్తుత కేసులు ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.09 శాతంగా ఉన్నాయి అలాగే జాతీయ కోవిడ్ -19 (National Covid-19)రికవరీ రేటు 98.72 శాతంగా నమోదైంది, బుధవారం ఉదయం 8 గంటల వరకు నమోదైన కేసులు వివరాలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది .

ఇప్పటి వరకు వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,42,04,771కి పెరిగింది మరియు కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్(Vaccination Drive) కింద ఇప్పటివరకు దేశంలో 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి .

ఢిల్లీ(delhi)లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, మాస్క్‌లు ధరించడం, హ్యాండ్ శానిటైజర్‌లను తరచుగా ఉపయోగించడం,భౌతిక దూర నిబంధనలను కొనసాగించడం వంటి నివారణ చర్యలకు సుప్రీంకోర్టు(supreme court) పిలుపునిచ్చింది.

Updated On 12 April 2023 12:27 AM GMT
rj sanju

rj sanju

Next Story