Longest Day Of Daylight : ఈ రోజు అతిపెద్ద పగటి రోజు 13 గంటల 7 నిమిషాల పాటు పగలు... గుడివాడలో మొదట ఉదయించిన సూర్యుడు
ఈ ఏడాదిలో అతి పెద్ద పగటి రోజును(Longest Day) ఇవాళ మనం అనుభవించబోతున్నాం. ఇప్పటికే పాతిక భాగం పగలు అయిపోయిందనుకోండి. ఇవాళ పగలు ఎక్కువగా ఉండి, రాత్రి(Night) తక్కువగా ఉంటుంది. 13 గంటల ఏడు నిమిషాల పాటు పగలు ఉంటుంది. ఇంత సుదీర్ఘమైన పగలు మళ్లీ వచ్చే ఏడాదే వస్తుంది. సాధారణ రోజుల్లో పగటి సమయం 12 గంటలు, రాత్రి సమయం 12 గంటలు ఉంటుంది.
ఈ ఏడాదిలో అతి పెద్ద పగటి రోజును(Longest Day) ఇవాళ మనం అనుభవించబోతున్నాం. ఇప్పటికే పాతిక భాగం పగలు అయిపోయిందనుకోండి. ఇవాళ పగలు ఎక్కువగా ఉండి, రాత్రి(Night) తక్కువగా ఉంటుంది. 13 గంటల ఏడు నిమిషాల పాటు పగలు ఉంటుంది. ఇంత సుదీర్ఘమైన పగలు మళ్లీ వచ్చే ఏడాదే వస్తుంది. సాధారణ రోజుల్లో పగటి సమయం 12 గంటలు, రాత్రి సమయం 12 గంటలు ఉంటుంది. ఈ రోజు సూర్యుడు(Sun) ఉత్తరార్థ గోళంలో కర్కట రేఖకు లంబంగా వస్తాడు కాబట్టి ఇవాళ పగలు ఓ గంట ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మన దేశంలో మొదటి సూర్యోదయం అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏర్పడుతుంది. అక్కడి దోంగ్ గ్రామంలో సూర్యుడు ముందుగా ఉదయిస్తాడు. కానీ ఈ రోజున మాత్రం మధ్యప్రదేశ్‌లోని(Madhya pradesh) ఉజ్జయినిలో(Ujjain) తొలి సూర్యోదయం జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లోని(andhra Pradesh) గుడివాడలోనూ(Gudivada) అదే సమయంలో సూర్యుడు ఉదయించాడు. అతిపెద్ద పొడవైన రోజులుగా వేసవి కాలాన్ని పేర్కొంటారు. భూమి చిన్నగా ఉండి.. దీర్ఘకాలం భూ భ్రమణంలో వేగం తగ్గుతుందని, ఈ పరిణామ క్రమంలో కొన్నిసార్లు పగటి సమయం ఎక్కువగా ఉంటుందని శాస్త్రజ్ఞులు తేల్చారు. ఇవాళ తెల్లవారుజామున 5.34 గంటలకు సూర్యుడు ఉదయించాడు. సాయంత్రం 6.41 గంటలకు అస్తమిస్తాడు. ప్రతి సంవత్సరం జూన్ 20 లేదా 21వ తేదీన లేదా డిసెంబర్‌లో ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయి. మార్చి 21, సెప్టెంబర్ 21 రోజుల్లో పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. వీటిని విషవత్తులు అంటారు. ఇవాళ పగలు ఎలాగైతే ఎక్కువగా ఉందో అలాగే డిసెంబర్ 22న రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది.