Romance in Relationship : శృంగారానికి-రిలేషన్ షిప్‌కు సంబంధమేంటి..?
రిలేషన్‌షిప్‌లో (Relationship) ఉంటే సెక్స్ మస్ట్ ఆ.. సెక్స్ లేకుండా రిలేషన్‌షిప్ కొనసాగించవచ్చా అనే డౌట్స్(Doubts) చాలా మందిలో ఉంటాయి. వ్యక్తిగత నమ్మకాలు, కోరికలు, పరస్పర భావాలను బట్టి రిలేషన్‌షిప్‌లో శృంగారం ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. కొందరు రిలేషన్‌షిప్‌లో సెక్స్ ముఖ్యమనుకుంటే.. మరికొందరు సెక్స్ లేకుండానే హెల్దీ(Healthy) రిలేషన్‌షిప్‌ను మెయింటెయిన్ చేయొచ్చంటున్నారు. రిలేషన్‌షిప్-సెక్స్ అనే అంశంపై దక్షిణాఫ్రికాకు( South Africa) చెందిన ప్రముఖ హెల్త్ రైటర్ సియాన్ ఫెర్గూసస్(Sian ferguson) ఏమన్నారంటే.
రిలేషన్‌షిప్‌లో (Relationship) ఉంటే సెక్స్ మస్ట్ ఆ.. సెక్స్ లేకుండా రిలేషన్‌షిప్ కొనసాగించవచ్చా అనే డౌట్స్(Doubts) చాలా మందిలో ఉంటాయి. వ్యక్తిగత నమ్మకాలు, కోరికలు, పరస్పర భావాలను బట్టి రిలేషన్‌షిప్‌లో శృంగారం ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. కొందరు రిలేషన్‌షిప్‌లో సెక్స్ ముఖ్యమనుకుంటే.. మరికొందరు సెక్స్ లేకుండానే హెల్దీ(Healthy) రిలేషన్‌షిప్‌ను మెయింటెయిన్ చేయొచ్చంటున్నారు. రిలేషన్‌షిప్-సెక్స్ అనే అంశంపై దక్షిణాఫ్రికాకు( South Africa) చెందిన ప్రముఖ హెల్త్ రైటర్ సియాన్ ఫెర్గూసస్(Sian Ferguson) ఏమన్నారంటే...
చాలా మంది లైంగిక(Romance) కార్యకలాపాలు లేకుండా రిలేషన్‌షిప్స్ కొనసాగిస్తారు. వివాహం (Marriage) వరకు సెక్స్ వద్దనుకోవడం సహా కేరీర్, వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. సెక్స్ లేకపోయినంత మాత్రాన అన్‌హెల్తీ (Unhealthy) రిలేషన్‌షిప్ లేదా ప్రేమ లేకపోవడం అనేది ఉండదని సియాన్ ఫెర్గూసస్ అంటున్నారు. మరోవైపు చాలా మంది రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో సెక్స్‌కు ప్రాధాన్యతనిస్తారు. పార్ట్‌నర్‌తో(Partner) బాండింగ్, లవ్ (Love), ఎఫెక్షన్ (Affection) ఏర్పడాలంటే సెక్స్ కీలకమని భావిస్తున్నారు. మానసిక సుఖం లేదా సంతానం కోసం సెక్స్ ఉండాలని కోరుకుంటారన్నారు. బాండింగ్ ఆపర్చునిటీగా ఉండొచ్చు లేదా ప్రేమను వ్యక్తికరించే మార్గం ఈ సెక్స్ కావొచ్చంటున్నారు ఫెర్గూసస్. సెక్స్ వల్ల ఆత్మవిశ్వాసం(Self Confidence), రోగ నిరోధక శక్తిపెరగడం(Immunity), ఒత్తిడి(Stress) నుంచి ఉపశమనం పొందుతారని తెలిపారు. క్రమంగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడంతో శారీరకంగాను(Physically), మానసికంగానూ(Mentally) అనేక లాభాలు పొందే అవకాశం కలుగుతుందని.. తద్వార తేలికపాటి వ్యాయామంతో(Exercise) గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తందంటున్నారు. అంతేకాదండోయ్... ఎక్కువ సెక్స్ అనేది ఆప్యాయతను కూడా సూచిస్తుందట. కాకపోతే అవతలి వ్యక్తి ఇష్టం లేకుండా సెక్స్ కోసం ఒత్తిడి చేయకూడదని అంటున్నారు. భాగస్వామితో కనెక్ట్ కావడానికి ఇదొక్కటే మార్గం కాదని.. ఫీల్ గుడ్ టచ్ (Feel good touch), ఓపెన్ కమ్యూనికేషన్(Open communication) కూడా ముఖ్యమేనంటున్నారు.
అయితే కాలక్రమేణా శరీరంలో మార్పుల వల్ల సెక్స్ పట్ల అనాసక్తత నెలకొంటుందన్నారు. కోరికలు(Libido) పెరగడం, తగ్గడం సర్వసాధారణం. దీంతో సెక్స్‌ను కోరుకోకపోవడం సమస్యగా భావించకూడాదని అంటున్న ఆయన.. లైంగిక కోరికలు కలగకపోవడంపై ఓపెన్‌గా మాట్లాడుకోవడం, అవసరమైతే వైద్యుడి(Physician) సలహాలు పొందడం వంటివి చేయాలంటున్నారు. పడకగదిలో(Bed room) కొత్త విధానాలను అవలంబించడం, సెక్స్‌పై ఓపెన్‌గా మాట్లాడితే ఈ సమస్యను అధిగమించే అవకాశముందంటున్నారు. అవసరమైతే కౌన్సెలింగ్ (counselling)లేదా సెక్స్ థెరపీ కోసం నిపుణులను సంప్రదించాలని సియాస్ ఫెర్గూసస్ సూచిస్తున్నారు.