Pink pigeons : గులాబీరంగు పావురాన్ని ఎప్పుడైనా చూశారా?
పావురాలు(Pigeons) తెలుగు, నలుపు, బూడిద రంగులోనే ఉంటాయి కదా! మరి మీరెప్పుడైనా గులాబీరంగులో(Pink Pigeon) ఉన్న పావురాన్ని చూశారా? చూడకపోతే మాత్రం అర్జెంట్‌గా బ్రిటన్‌కు(Britain) వెళ్లాల్సి ఉంటుంది. యూకేలోని(UK) గ్రేట్ మాంచెస్టర్(Great Manchester) దగ్గర టౌన్ సెంటర్ సమీపంలో హఠాత్తుగా గులాబీరంగు పావురం ప్రత్యక్షమయ్యింది.
పావురాలు(Pigeons) తెలుగు, నలుపు, బూడిద రంగులోనే ఉంటాయి కదా! మరి మీరెప్పుడైనా గులాబీరంగులో(Pink Pigeon) ఉన్న పావురాన్ని చూశారా? చూడకపోతే మాత్రం అర్జెంట్‌గా బ్రిటన్‌కు(Britain) వెళ్లాల్సి ఉంటుంది. యూకేలోని(UK) గ్రేట్ మాంచెస్టర్(Great Manchester) దగ్గర టౌన్ సెంటర్ సమీపంలో హఠాత్తుగా గులాబీరంగు పావురం ప్రత్యక్షమయ్యింది. వాకింగ్‌కు వచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది. పోలీసుల పెట్రోలింగ్‌తో జనసందోమంగా ఉనన ఈ ప్రదేశంలో ఈ పింక్ కలర్ పావురం కనువిందు చేసింది. రంగు ఏమైనా పావురం మీద పడిందో ఏమో అన్న అనుమానాలు కూడా కొందరికి వచ్చాయి. మొదట ఈ పావురాన్ని చూసిన వారు అసలు దాన్ని పావురమే అనుకోలేదు. అదేదో వింత పక్షి అని అనుకున్నారు. కాసేపు నిశితంగా చూస్తే కానీ అది పింక్ కలర్‌లో ఉన్న పావురమని అర్థం కాలేదు. గతంలో న్యూయార్క్ నగరంలో జెండర్ రివీల్ పార్టీలో అందరినీ ఆకర్షించడానికి ఓ పావురానికి గులాబీరంగు వేసి పెట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆ పావురాన్ని రక్షించారు. ఆ పావురం పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు గుర్తించి దాన్ని వైల్డ్ బర్డ్ ఫండ్‌కు తరలించారు. అలానే ఈ కపోతానికి కూడా ఎవరైన గూలాబీ రంగు వేశారేమోనని అనుమానపడుతున్నారు. అయితే ఈ పావురాన్ని ఎవరూ బంధించలేదుఉ. మిగతా పావురాల్లాగే స్వేచ్ఛగా ఎగురుతూ కనిపించింది. అయితే ఈ పావురానికి గులాబి రంగు ఎలా వచ్చిందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పింక్ కలర్ పావురం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.