దేశంలోనే అత్యంత విలాసవంతమైన ఖరీదైన ఇంటి గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనకు గుర్తువచ్చేదిప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి చెందిన యాంటిలియా(Antilia ) బిల్డింగ్ అని చాల మందికి తెలుసు . దీని ఖరీదు దాదాపు రూ.12,000 కోట్లు. కానీ, దేశంలో ఇప్పటివరకు అమ్మబడిన అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం .

దేశంలోనే అత్యంత విలాసవంతమైన ఖరీదైన ఇంటి గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనకు గుర్తువచ్చేదిప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి చెందిన యాంటిలియా(Antilia ) బిల్డింగ్ అని చాల మందికి తెలుసు . దీని ఖరీదు దాదాపు రూ.12,000 కోట్లు. కానీ, దేశంలో ఇప్పటివరకు అమ్మబడిన అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం . ఈ అపార్ట్మెంట్ యొక్క స్టాంప్ డ్యూటీ(Stamp duty ) ఖర్చుల తో అనేక బంగ్లాలు ఇంకా కొనవచ్చు అని తెలిస్తే ఆశ్చర్యపడని వారు ఉండరు .

ముంబైలోని( Mumbai )మాయానగరిలో దేశంలోనే అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను అమ్మడం జరిగింది . దీని ఖర్చు రూ.369 కోట్లు. భారతదేశంలో ఇప్పటివరకు విక్రయించబడిన అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ ఇదే. కొన్న వ్యక్తి పేరు జేపీ తపరియా. ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసేందుకు ఏకంగా రూ.19.07 కోట్ల విలువతో కూడిన స్టాంప్ డ్యూటీ ని ఇప్పటివరకు చెల్లించారు. దక్షిణ ముంబైలోని మలబార్ హిల్‌లో ఈ లగ్జరీ ట్రిప్లెక్స్ హౌస్ నిర్మాణం లో ఉన్నది . ఇది ఒక వైపు అరేబియా సముద్రం(Arebian sea ) మరియు మరొక వైపు హాంగింగ్ గార్డెన్స్(hanging gardens ) యొక్క అందమైన దృశ్యాలను కలిగి ఉంది.

2026 నాటికి ఈ అపార్ట్మెంట్ పూర్తి స్థాయి లో సిద్ధం అవుతుంది
ఈ అపార్ట్‌మెంట్ లోధా మలబార్ రెసిడెన్షియల్( Malabar residential )టవర్‌లోని 26, 27 మరియు 28వ అంతస్తులో ఉంది మరియు ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. 2026 నాటికి ఇది సిద్ధమవుతుందని భావిస్తున్నారు. ఇంతకుముందు, ఈ టవర్‌లో(tower ) భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఇంటిని నీరజ్ బజాజ్(Niraj Bajaj ) కొనుగోలు చేశారు. 252.50 కోట్లతో పెంట్‌హౌస్‌ను కొనుగోలు చేశారు.

ఈ అపార్ట్‌మెంట్( Apartment )మొత్తం 27,160 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది, దీని ధర చదరపు అడుగుకు రూ. 1.36 లక్షల చొప్పున నిర్ణయించబడింది . ఆ విధంగా ఇది భారతదేశంలో(india) అత్యంత ఖరీదైన హౌస్ అగ్రీమెంట్ గా(House agreement ) పేరొందింది . ఇంత ఖరీదైన ఇంటిని సొంతం చేసుకోబోతున్న యజమాని జేపీ తపాడియా( JP Thapadia )ఎవరు అనుకుంటే

JP తపాడియా కాంట్రాసెప్టివ్ ప్రొడక్ట్స్( contraceptive products ) అయిన (Famy Care) వ్యవస్థాపకుడు. తపాడియా కుటుంబానికి అనంత్ క్యాపిటల్(capital ), స్ప్రింగ్‌వేల్(Springwell ) మరియు గార్డియన్ ఫార్మసీలో(Gradian Pharmacy ) కూడా వాటాలు ఉన్నాయి. తపాడియా కుటుంబం గత ఏడాది నవంబర్‌లో తన ఐకేర్( icare )వ్యాపారాన్ని వైట్రిస్ ఇంక్‌కి రూ.2,460 కోట్లకు అమ్మింది . ఇంతకు ముందు కూడా 2015లో తన ఉమెన్స్ హెల్త్‌కేర్ వ్యాపారాన్ని మైలాన్‌కు రూ.4,600 కోట్లకు అమ్మడం జరిగింది . తపాడియా కుటుంబం ఆ విధంగా తమ రెండు భారీ అమ్మకాలను జరిపి రూ. 7,000 కోట్లకు పైగా సంపాదించింది.

Updated On 1 April 2023 6:47 AM GMT
Ehatv

Ehatv

Next Story