Marriage Cancel: మీ దుంపలు తెగ.. నల్లి బొక్క కోసం పెళ్లిని రద్దు చేసుకున్నారా..!
ఈ మధ్య కాలంలో బలగం (Balagam Movie) సినిమా ఎంత ప్రేక్షకాదరణ పొందిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ములుగ ( Nalli Bone) బొక్క కోసం ఎంత పంచాయతీ జరిగిందో చూశాం. సేమ్ టు సేమ్ ఇదే సీన్ నిజజీవితంలో జరిగింది.
ఈ మధ్య కాలంలో బలగం (Balagam Movie) సినిమా ఎంత ప్రేక్షకాదరణ పొందిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ములుగ ( Nalli Bone) బొక్క కోసం ఎంత పంచాయతీ జరిగిందో చూశాం. సేమ్ టు సేమ్ ఇదే సీన్ నిజజీవితంలో జరిగింది. కాకుంటే అక్కడ బంధుత్వాలు విడిపోతే ఇక్కడేమో పెళ్లి (Marriage) సంబంధం రద్దు చేసుకున్నారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఉమ్మడి కరీనంగర్ జిల్లా మెట్‌పల్లి (Metpally) మండలానికి చెందిన యువకుడికి నిజామాబాద్ (Nizamabad) జిల్లాకు చెందిన యువతితో వివాహం నిశ్చమైంది. ముహూర్తాలు సైతం నిర్ణయించుకున్నారు. కట్నకానుకలు, వివాహ సమయం నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా గత నెల మొదటి వారంలో అమ్మాయి ఇంట్లో నిశ్చితార్థం (Engagement) జరిగింది. విందు భోజనంలో నల్లి బొక్క కావాలని పెళ్లికొడుకు బంధువులు కోరారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగింది. చినికి చినికి పోలీస్‌స్టేషన్ (Police Station) వరకు చేరింది. ఇరువర్గాలను పోలీసులు శాంత పర్చినప్పటికీ పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చూశారా ఈ నల్లి బొక్క ఎంత పనిచేసిందో..!