XPoSat: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ 58.
XPoSat: పీఎస్‌ఎల్‌వీ-సీ 58 (PSLV-C58) ప్రయోగం విజయవంతమయ్యింది. శ్రీహరికోట (SrihariKota) నుంచి నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ 58 దూసుకెళ్లింది. 2024 కొత్త సంవత్సరం ప్రారంభం రోజునే ఇస్రో (ISRO) తొలి ప్రయోగాన్ని విజయవంతం చేసుకుంది
పీఎస్‌ఎల్‌వీ-సీ 58 (PSLV-C58) ప్రయోగం విజయవంతమయ్యింది. శ్రీహరికోట (SrihariKota) నుంచి నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ 58 దూసుకెళ్లింది. 2024 కొత్త సంవత్సరం ప్రారంభం రోజునే ఇస్రో (ISRO) తొలి ప్రయోగాన్ని విజయవంతం చేసుకుంది. ఈ ఎక్స్‌పోశాట్ (XPoSat) ఉప్రగ్రహ జీవితకాలం అయిదేళ్లు. ఎక్స్-రే మూలాలను అన్వేషించడమే ప్రధాన లక్ష్యంగా ప్రయోగం.కాంతివంతమైన అంతరిక్ష ఎక్స్‌రే కిరణాల మూలాల సంక్లిష్టతను, అసాధారణ పరిస్థితుల్లో వాటి ప్రభావాన్ని ఎక్స్ పో శాట్ అధ్యయనం చేయనుంది. ఈ అధ్యయనానికిగాను ఎక్స్‌పోశాట్‌లో రెండు అత్యాధునిక సాంకేతికత కలిగిన పేలోడ్‌లను అమర్చారు. ఇవి తక్కువ ఎత్తులో గల భూ కక్ష్య నుంచి అధ్యయనాన్ని కొనసాగిస్తాయి. ఎక్స్‌పోశాట్‌లోని ప్రాథమిక పరికరం పోలిక్స్ మధ్యతరహా ఎక్స్‌రే కిరణాలను వెదజల్లే మూలాలపై ఉప్రగహం పరిశోధన చేస్తుంది. ఇక మిగిలిన ఎక్స్‌స్పెక్ట్ పేలోడ్ అంతరిక్షంలోని బ్లాక్‌హోళ్లు, న్యూట్రాన్ నక్షత్రాలు, యాక్టివ్ గలాటిక్ న్యూక్లై, పల్సర్ విండ్, నెబ్యులా తదితరాల నుంచి వెలువడే ఎక్స్‌రే కిరణాల స్పెక్ట్‌రోస్కోపిక్ సమాచారాన్ని అందించనుంది. గడిచిన ఏడాది 2023లో ఇస్రో చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాలతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.