First Pulasa Fish : పులస వచ్చేసింది... రెండు కిలోల చేప ఎంతకమ్ముడయ్యిందో తెలుసా?
పుస్తెల అమ్మి అయినా సరే పులస(Pulasa Fish) తినాలి అని అంటుంటారు. నిజంగానే పులస రుచే వేరు! చాలా అరుదుగా లభించే ఈ చేప కోసం జనం వెర్రెక్కిపోతారు. ఇప్పుడు పులస సీజన్ మొదలయ్యింది. మార్కెట్‌లోకి మొదటి చేప వచ్చింది. అనుకున్నట్టుగానే మంచి రేటుకు అమ్ముడయ్యింది. యానం గోదావరికి ఎర్ర నీరు పోటెత్తిన సమయంలో పులసలు లభ్యమవుతాయని తెలిసిందే
పుస్తెల అమ్మి అయినా సరే పులస(Pulasa Fish) తినాలి అని అంటుంటారు. నిజంగానే పులస రుచే వేరు! చాలా అరుదుగా లభించే ఈ చేప కోసం జనం వెర్రెక్కిపోతారు. ఇప్పుడు పులస సీజన్ మొదలయ్యింది. మార్కెట్‌లోకి మొదటి చేప వచ్చింది. అనుకున్నట్టుగానే మంచి రేటుకు అమ్ముడయ్యింది. యానం గోదావరికి ఎర్ర నీరు పోటెత్తిన సమయంలో పులసలు లభ్యమవుతాయని తెలిసిందే. ఈ క్రమంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు(Fisher men) వారం తర్వాత మొట్టమొదటి పులస దొరికింది. దాదాపు రెండు కిలోలీ బరువున్న ఈ చేపను 15 వేల రూపాయలకు అమ్మినట్టు ఓ మహిళ చెప్పారు. పులసల కోసం కాకినాడ(Kakinada), రాజమండ్రి(Rajahmundry) నుంచే కాదు, హైదరాబాద్ నుంచి కూడా జనం వస్తుంటారని ఆ మహిళ చెబుతున్నారు. నదీ ప్రవాహానికి అతి వేగంగా ఎదురీదే ఈ చేపను జీవితంలో ఒక్కసారైనా తినాలని భావిస్తుంటారు చాలా మంది.
ఇవి గోదావరి నదిలో మాత్రమే లభిస్తాయి. ఇదే చేప సముద్రంలో దొరికితే మాత్రం దాన్ని వలస చేప అంటారు. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అవి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది దగ్గర సముద్రంలో కలిసే సమయంలో అంటే జూన్ నుంచి ఆగస్టు నెలల మధ్యన ఈ చేపలు గోదావరిలోకి ఎదురీదుకుంటూ వెళతాయి. గుడ్లు పెట్టిన తర్వాత అక్టోబరులో సముద్రంలో ప్రవేశిస్తాయి. గోదావరి వరద నీటిలో గుడ్లు పొదగడానికి వచ్చి మత్స్యకారుల వలలో పడతాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే వలలో పడిన వెంటనే ఇవి చనిపోవు. అలాగే రెండు రోజులైనాఇవి పాడవ్వవు. అందుకే వీటికి అంత డిమాండు!