కరీంనగర్-సిరిసిల్ల ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడి వేలం (Auction) నేడు కరీంనగర్ డిపోలో (Karimnagar Depot) మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఆసక్తి ఉన్నవారు ఈ వేలం పాటలో పాల్గొనాలని ఆర్టీసీ (Rtc) యాజమాన్యం కోరింది. దీంతో ఈ అంశం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది

కరీంనగర్-సిరిసిల్ల ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడి వేలం (Auction) నేడు కరీంనగర్ డిపోలో (Karimnagar Depot) మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఆసక్తి ఉన్నవారు ఈ వేలం పాటలో పాల్గొనాలని ఆర్టీసీ (Rtc) యాజమాన్యం కోరింది. దీంతో ఈ అంశం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఆర్టీసీకి ఈ కోడి ఎంత ఆదాయం ఇస్తుందోనని ఉత్సాహంగా అందరూ ఎదురుచూస్తున్నారు.

ఈ నెల 9వ తేదీన వరంగల్‌ (Warangal) నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెళుతున్న బస్సు కరీంనగర్‌ బస్‌స్టేషన్ దగ్గర కాసేపు ఆగింది. అప్పుడు పందెంకోడిని తన వెంట తీసుకుని వెళుతున్న ఓ ప్రయాణికుడు దాన్నిబస్సులోనే మరిచి వెళ్లిపోయాడు. బస్సులు బ్యాగ్‌ గమనించిన తోటి ప్రయాణికులు విషయాన్ని కంట్రోలర్‌కు (Controller) చెప్పారు. బ్యాగులో ఏముందోనని ఆర్టీసీ సిబ్బంది దాన్ని తెరచిచూశారు. అంతే బిత్తరపోయారు. చక్కగా ప్యాక్‌ చేసి ఉంచిన పందెం కోడి కనిపించింది. ఆ కోడిని సంరక్షించడానికి ఆర్టీసీ సిబ్బంది కరీంనగర్‌-2 డిపోకు తరలించారు. దాన్ని తీసుకువెళ్లడానికి యజమాని వస్తాడేమోనని మూడురోజులుగా ఎదురుచూస్తున్నారు. వాళ్లు మాత్రం ఆ కోడిని ఎన్నాళ్లను చూసుకుంటారు చెప్పండి? అందుకే దాన్ని వేలం వేయాలని డిసైడయ్యారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు డిపో కార్యాలయంలో బహిరంగ వేలం వేయడానికి ఓ ప్రకటన ఇచ్చారు. ఆసక్తికలవారు వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు.

Updated On 11 Jan 2024 11:07 PM GMT
Ehatv

Ehatv

Next Story