TS Ministers Got Portfolio: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు..!
తెలంగాణ మంత్రుల (Ministers) కు కాంగ్రెస్ (Congress) పార్టీ అధిష్టానం శాఖలు కేటాయించింది. ఇదే అంశంపై నిన్న ఢిల్లీ వెళ్లిన రేవంత్ (Revanth) అధిష్టానంతో చర్చించి ఈ శాఖల కేటాయింపుపై నిర్ణయానికి వచ్చారు.
తెలంగాణ మంత్రుల (Ministers) కు కాంగ్రెస్ (Congress) పార్టీ అధిష్టానం శాఖలు కేటాయించింది. ఇదే అంశంపై నిన్న ఢిల్లీ వెళ్లిన రేవంత్ (Revanth) అధిష్టానంతో చర్చించి ఈ శాఖల కేటాయింపుపై నిర్ణయానికి వచ్చారు
తెలంగాణ సీఎం (CM) రేవంత్‌రెడ్డి దగ్గర మున్సిపల్ (Muncipal), అర్బన్ డెవలప్‌మెంట్ (Urban Devlopment), జీఏడీ (GAD), శాంతిభద్రతలే (Law & Order) కాకుండ ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు సీఎం దగ్గరే ఉండనున్నాయి. డిప్యూటీ సీఎం (Deputy CM) భట్టివిక్రమార్కకు ఆర్థిక (Finance), విద్యుత్‌శాఖ (Power) కేటాయించారు. మంత్రి దామోదర రాజనరసింహకు ఆరోగ్యశాఖ (Health), సైన్స్ అండ్ టెక్నాలజీ (Science & Technology) కేటాయించగా.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రోడ్లు, భవనాలుశాఖ,(R & B) సినిమాటోగ్రఫీ (Cinematography), మంత్రి శ్రీధర్‌బాబుకు ఐటీ (IT), పరిశ్రమలు(Industries), శాసనసభా వ్యవహారాలశాఖ (Legslative Affairs)దక్కింది. మంత్రి కొండా సురేఖకు అటవీ (Forest), దేవాదాయశాఖలు (Endowment) కేటాయించగా.. మరో మంత్రి సీతక్కకు కీలక పంచాయతీరాజ్‌శాఖ (Panchayathraj), రూరల్ డెవలప్‌మెంట్ (Rural Devlopment), స్త్రీ-శిశు సంక్షేమశాఖ (Child & Women Welfare)లు దక్కాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయశాఖ (Agriculture), మార్కెటింగ్ (Marketing) హ్యాండ్లూమ్స్ & టెక్స్‌టైల్స్‌శాఖ (Handlooms & Textiles)లు కేటాయించారు. జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్ (Excice), పర్యాటకశాఖలు (Tourism) కేటయించగా.. కీలకమైన నీటిపారుదల (Irrigation), పౌరసరఫరాలశాఖ (Civil Supplies)ఉత్తంకుమార్‌రెడ్డికి కేటాయించారు. మరో మంత్రి పొంగులేటి సుధాకర్‌రెడ్డికి రెవెన్యూ (Revenue), హౌసింగ్ (Housing) సమాచారశాఖలు (I & PR)దక్కాయి. పొన్నం ప్రభాకర్‌కు రవాణాశాఖ (Transport), బీసీ సంక్షేమశాఖ (BC Welfare) కేటాయించారు.
- Telanagana cmoTelangan TourismTelangana BC WelfareTelangana Housing DeptTelangana Revenue DeptTS Aggriculture deptTS AssemblyTS Civil Supplies DeptTS Excice DeptTS FinanceTS ForestTS Health DeptTS I & PRTS Information TechnologyTs IrrigationTS MinistersTS PanchayathRaj DeptTS RevenueTS Roads & Buildings dept