ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని గల్లీకో దొంగబాబాలు పుట్టుకొస్తున్నారు. అలాంటివాడే షైక్నాలా లేబ్బే! నలభై ఏళ్ల కిందట తమిళనాడు(Tamil Nadu) నుంచి వరంగల్‌కు వచ్చి స్థిరపడ్డాడు. తనకు మంత్రశక్తులు ఉన్నాయంటూ స్థానికంగా ప్రచారం చేసుకున్నాడు. ప్రత్యేక పూజలు చేసి, తాయెత్తులు కట్టడం ద్వారా కుటుంబ కలహాలు(Family Problems), భార్యాభర్తల(Relationship Problems) మధ్య తగాదాలు, ఆరోగ్య సమస్యలను(Health Problems) పరిష్కరిస్తానని టముకేసుకున్నాడు.

ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని గల్లీకో దొంగబాబాలు పుట్టుకొస్తున్నారు. అలాంటివాడే షైక్నాలా లేబ్బే! నలభై ఏళ్ల కిందట తమిళనాడు(Tamil Nadu) నుంచి వరంగల్‌కు వచ్చి స్థిరపడ్డాడు. తనకు మంత్రశక్తులు ఉన్నాయంటూ స్థానికంగా ప్రచారం చేసుకున్నాడు. ప్రత్యేక పూజలు చేసి, తాయెత్తులు కట్టడం ద్వారా కుటుంబ కలహాలు(Family Problems), భార్యాభర్తల(Relationship Problems) మధ్య తగాదాలు, ఆరోగ్య సమస్యలను(Health Problems) పరిష్కరిస్తానని టముకేసుకున్నాడు. వీడి మాయమాటలు నమ్మి చాలా మంది ఇతడిని ఆశ్రయించారు. అలా వీడి దగ్గరకు వచ్చిన వారిలో చాలా మంది యువతులు, వివాహితులు ఉన్నారు. వారికి మాయమాటలు చెప్పి తర్వాత వారిపై అత్యాచారానికి(Sexual Assault) పాల్పడ్డాడు. బయటకు చెప్పుకుంటే పరువుపోతుందన్న ఉద్దేశంతో చాలా మంది గమ్మున ఉండిపోయారు.

ఆ భయంతోనే పోలీసులకు కూడా కంప్లయింట్‌ ఇవ్వలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని ఇంకాస్తా బరితెగించాడు ఈ ప్రబుద్ధుడు. ఈ మధ్యనే ఓ మహిళపై కన్నేశాడు. ప్రత్యేక పూజలు చేస్తున్నట్టు నటించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మిగతా బాధితురాళ్లలా కాకుండా ఈమె టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను(Task Force Police) ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దొంగబాబా అంతు చూద్దామనుకున్నారు. అతడి దగ్గరకు ఓ మహిళను పంపారు. పూజల పేరుతో ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగా అతడిని పట్టుకున్నారు. ఆ కీచకబాబా నుంచి ఎర్రదారాలు, నల్లదారాలు, తాయెత్తులు, నిమ్మకాయలు, దిష్టి గురుగులు, వనమూలికలు, నూనె డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు. పాతిక వేల రూపాయల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఆ దొంగబాబాను కటకటాల వెనక్కి నెట్టారు.

Updated On 14 Jun 2023 1:57 AM GMT
Ehatv

Ehatv

Next Story