దాదాపు 18 ఏళ్లుగా టాలీవుడ్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది హాట్ బ్యూటీ తమన్నా. చిన్న హీరోలతో మొదలు పెట్టి స్టార్ హీరో సరసన మెరిసిన బ్యూటీ. తాజాగా మెగాస్టార్ తో జతకలిసి ఆడిపాడుతోంది. ఏజ్ బార్ అవుతున్నా కాని.. ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా చూసుకుంటుంది బ్యూటీ.. వరుసగా సినిమాలు ఆమె ఖాతాలో పడుతూ వస్తున్నాయి.

మూడు పదులు దాటి వయస్సు పరుగులు పెడుతున్నా.. హీరోయిన్ గా కెరీర్ ను కూడా పరుగులుపెట్టిస్తుంది తమన్నా(Tamannaah). వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్న మిల్క్ బ్యూటీ.. తాజాగా తెలుగు హీరోల గురించి హాట్ కామెంట్స్ చేసింది.

దాదాపు 18 ఏళ్లుగా టాలీవుడ్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది హాట్ బ్యూటీ తమన్నా. చిన్న హీరోలతో మొదలు పెట్టి స్టార్ హీరో సరసన మెరిసిన బ్యూటీ. తాజాగా మెగాస్టార్ తో జతకలిసి ఆడిపాడుతోంది. ఏజ్ బార్ అవుతున్నా కాని.. ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా చూసుకుంటుంది బ్యూటీ.. వరుసగా సినిమాలు ఆమె ఖాతాలో పడుతూ వస్తున్నాయి.

మరీ ముఖ్యంగా తమన్నాకు సెకండ్ ఇన్నింగ్స్ బాగా కలిసి వచ్చింది. రీ ఎంట్రీలో అదరగొడుతుంది మిల్క్ బ్యూటీ. తెలుగు, తమిళ్, హిందీలో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్(Web series) లు చేస్తూ... దూసుకుపోతోంది. తాజాగా ఆమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) జోడీగా.. . మెహర్ రమేష్(Mehar Ramesh) దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్(Bholashnakar) సినిమాలో నటించింది. ఈసినిమా ఈనెల 11న రిలీజ్ కాబోతుంది.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. భోళాశంకర్ ప్రమోషన్స్ కు మాత్రం వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.. పదును పెట్టారు కూడా. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా..బుల్లితెర స్టార్ కమెడియన్ హైపర్ ఆది(Hyper Aadhi) యాంకర్ గా తమన్నా, డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంటర్వ్యూ ఒకటి బయటకు వచ్చింది.

ఈ ఇంటర్వ్యూ లో తమన్నా పలు ఆసక్తికర విషయాలని పంచుకుంది.ఈ క్రమంలో తెలుగులో పలువురు స్టార్ హీరోల గురించి తన మనసులో మాట చెప్పింది తమన్నా. తెలుగులో ఆ స్టార్ హీరోల గురించి హైపర్ ఆది అడగగా వారి గురించి తమన్నా మనసులో ఉన్నది ఒక్క మాటలో చెప్పేసింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి చాలా యూనిక్ గా ఉంటారని.. ఆయన ఒకే ఒక్కడు, ఆయనలా ఎవరూ ఉండలేరు అంది తమన్నా.. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వెరీ మాస్ హీరో, అండ్ స్టైలిష్ హీరో అంటూ కితాబిచ్చింది. అటు ఆరడుగుల అందగాడు.. ప్రభాస్(Prabhas) అయితే అందరి డార్లింగ్ అనేసింది. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh) అందగాడు.. చూడటానికి చాలా బాగుంటారు అన్నారు. అంతేనా.. ఎన్టీఆర్(NTR) ఆల్ రౌండర్.. అని..స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఒక ఐకాన్ అని తెలిపారు.

అంతే కాదు ఎన్టీఆర్ డాన్స్ తో పాటు ఫైట్స్ బాగుంటాయి అన్న తమన్నా.. రామ్ చరణ్(Ram charan) గురించి మాట్లాడుతూ.. చరణ్ నాకు రాయల్ మ్యాన్.. అనేసింది. దీంతో తెలుగు హీరోల గురించి తమన్నా చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవ్వగా ఆ హీరోల అభిమానులు తమ హీరో గురించి ఏం చెప్పిందా అని ఆ ఇంటర్వ్యూని చూస్తున్నారు.

Updated On 3 Aug 2023 12:28 AM GMT
Ehatv

Ehatv

Next Story