సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్ల కు ఎంత పాపులారిటీ ఉంటుందో అందరికి తెలిసిందే.. వాళ్లు మెయింటేనెస్ కూడా అంతే డిఫరెంట్ గా ఉంటుంది. మరికొంత మంది మాత్రం.. లక్షలు ఖర్చు పెట్టి బాడీని మెయింటేన్ చేస్తుంటారు. ఇక ఈ విషయలో హీరోయిన్ తాప్సీ ఈమధ్య షాకింగ్ న్యూస్ వెల్లడించింది.

సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్ల కు ఎంత పాపులారిటీ ఉంటుందో అందరికి తెలిసిందే.. వాళ్లు మెయింటేనెస్ కూడా అంతే డిఫరెంట్ గా ఉంటుంది. మరికొంత మంది మాత్రం.. లక్షలు ఖర్చు పెట్టి బాడీని మెయింటేన్ చేస్తుంటారు. ఇక ఈ విషయలో హీరోయిన్ తాప్సీ ఈమధ్య షాకింగ్ న్యూస్ వెల్లడించింది.

హీరోయిన్ గా బాడీని మెయింటేన్ చేయడం అంత ఈజీ కాదు. ఒక్క సారి పాపులర్ అయితే.. వాళ్ళరేంజ్ వేరే ఉంటుంది. కాని పాపులర్ అయిన తరువాత దాన్ని నిలబెట్టుకోవడం కోసం.. ఎంతో కష్టపడాల్సి వస్తుంది. దాని కోసం శారీరకంగా ఎంత కష్టపడాలో..మనీపరంగా కూడా అంతే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈవిషయంలో తాప్సీ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.

హీరోయిన్ గా ఉండాలంటే రకరకాలుగా మారాల్సి వస్తుంది. అంతే కాదు అందుకోసం నేను చాలా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాను అంటుంది తాప్సి. తాను ఒక్కో సినిమా కోసం ఒక్కోలా మారాల్సి ఉంటుంది. శరీరం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మన కంట్రోల్ లో కూడా ఉండదు.. మనమే మన కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి. ముఖ్యంగా బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు డైట్ మెయింటేన్ చేయడం ముఖ్యం.. అందుకే స్పెషల్ గా డైటీషియన్ ని పెట్టుకున్నాను అని అన్నారు తాప్సి.

ఇక మరో షాకింగ్ న్యూస్ ఏంటీ అంటే.. తన డైటీషియన్ కోసం నెలకు లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నాను అని వెల్లడించారు తాప్సి. అయితే ఈ విషయంలో తన పేరెట్స్ తనను ఎప్పుడూ తిడుతుంటారని అంటుంది బ్యూటీ. చిన్నతనంలో నాన్న భర్త్ డేకి పెన్ కొనిస్తేనే.. ఎందుకు డబ్బులువేస్ట్ చేస్తున్నావ్ అనేవారు.. ఇక డైటీషియన్ కు లక్ష అంటే ఎందుకు ఊరుకుంటారు అంటూ తన ఫ్యామిలీ విషయాలు కూడా వెల్లడించింది తాప్సీ.

ఇప్పుడు ఇంటికి వెళ్తే.. దీనిపై కూడా మరో డిస్కషన్ ఉంటుంది. అందుకే ఇంటికి వెళ్ళాలంటే కాస్త ఆలోచించాల్సి వస్తుంది అన్నారు తాప్సీ. ఇప్పుడు ఏం తినాలో ఏం తినకూడదో తెలియదు. అందుకే స్పెషల్ గా డైటీషియన్ కోసం అంత ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అని తాప్సీ చెప్పుకొచ్చింది.

ఇక జుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తాప్సీపన్ను. తెలుగులో ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. దాంతో 2015 లో బాలీవుడ్ కు షిప్ట్ అయ్యింది. అయితే టాలీవుడ్ లో గ్లామర్ పాత్రలకు ఇంపార్టెన్స్ ఇచ్చిన తాప్సీ.. బాలీవుడ్ మాత్రం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు, విమెన్ సెంట్రిక్ సినిమాలత పాపులర్ అయ్యింది. నిర్మాతగామారి కొన్ని సినిమాలు నిర్మించిన తాప్సీ.. బాలీవుడ్ లో కాంట్రవర్సీ కింగ్ లా మారింది. అంతే కాదు ఈమధ్య బయోపిక్ సినిమాల వెంట పడింది బ్యూటీ. మళ్ళీ టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది.

Updated On 17 March 2023 11:14 PM GMT
Ehatv

Ehatv

Next Story