హైదరాబాదీలు(Hyderabadis) గత ఆరు నెలల్లో 72 లక్షలకు పైగా బిర్యానీ(Biryani) ఆర్డర్లు చేశారని, గత 12 నెలల్లో 150 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్లు చేశారని ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ(Swiggy) శుక్రవారం వెల్లడించింది.
హైదరాబాదీలు(Hyderabadis) గత ఆరు నెలల్లో 72 లక్షలకు పైగా బిర్యానీ(Biryani) ఆర్డర్లు చేశారని, గత 12 నెలల్లో 150 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్లు చేశారని ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ(Swiggy) శుక్రవారం వెల్లడించింది.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్(Online Food Delivery Service) స్విగ్గి 2023 సంవత్సర మొదటి 6 నెలలకి సంబందించిన ఆసక్తికరమైన డేటా ని విడుదల చేసింది. 2022 ఇదే సమయంతో పోల్చితే గత ఐదున్నర నెలల్లో నగరంలో బిర్యానీ ఆర్డర్లలో 8.39% వృద్ధి నమోదైంది. దమ్ బిర్యానీ(Dum Biryani) 9 లక్షలకు పైగా ఆర్డర్లతో తిరుగులేని ఛాంపియన్గా నిలిచిందని స్విగ్గి పేర్కొంది.
7.9 లక్షల ఆర్డర్లతో ఫ్లేవర్డ్ బిర్యానీ రైస్ మొదటి స్థానంలో ఉండగా, మినీ బిర్యానీ(Mini Biryani) 5.2 లక్షల ఆర్డర్లతో రెండో స్థానం లో నిలిచింది.
జనవరి 2023 నుండి 15 జూన్ 2023 వరకు Swiggyలో చేసిన ఆర్డర్ల విశ్లేషణ ఆధారంగా ఈ ఫలితాలు వచ్చినట్లు కంపెనీ తెలిపింది.
హైదరాబాద్లో 15,000 కంటే ఎక్కువ రెస్టారెంట్లు తమ మెనూలలో బిర్యానీని అందిస్తున్నాయి. కూకట్పల్లి, మాదాపూర్(Madhapur), అమీర్పేట్(Ameerpet), బంజారాహిల్స్(Banjara Hills), కొత్తపేట్(Kothapet) & దిల్సుఖ్నగర్లలో(Dilsuknagar) అత్యధికంగా బిర్యానీ అందించే రెస్టారెంట్లు ఉన్నాయి, ఇవి నగరంలోని బిర్యానీ ఔత్సాహికుల విభిన్న రుచులను అందిస్తున్నాయి.
హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలలో ఆర్డర్ పరిమాణం పరంగా అత్యధిక బిర్యానీ వినియోగం కూకట్పల్లి తర్వాత మాదాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ లలో జరిగింది.