సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న బుల్లితెర సెలబ్రిటీ సుధీర్ ఎట్టకేలకు పెళ్లి చేసకోబోతునట్టు తెలుస్తోంది. ఇంతకీ అమ్మాయి ఎవరంటే..? సుడిగాలిసుధీర్ కు బుల్లితెరపై భారీ ఫాలోయింగ్ ఉంది. వెండితెరపై సూపర్ స్టార్స్.. మెగాస్టార్స్ ఎలాగో.. బుల్లితెరపై సుధీర్ ఇమేజ్ కూడా అలాగే. ఎలాగైనా హీరో అవ్వాలి అన్న పట్టుదలతో.. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై గట్టిగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు సుధీర్. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న బుల్లితెర సెలబ్రిటీ సుధీర్ ఎట్టకేలకు పెళ్లి చేసకోబోతునట్టు తెలుస్తోంది. ఇంతకీ అమ్మాయి ఎవరంటే..?

సుడిగాలిసుధీర్ కు బుల్లితెరపై భారీ ఫాలోయింగ్ ఉంది. వెండితెరపై సూపర్ స్టార్స్.. మెగాస్టార్స్ ఎలాగో.. బుల్లితెరపై సుధీర్ ఇమేజ్ కూడా అలాగే. ఎలాగైనా హీరో అవ్వాలి అన్న పట్టుదలతో.. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై గట్టిగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు సుధీర్. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే సుధీర్ ను చాలాసార్లు పెళ్లి విషయంలో ఆటపట్టించిన విషయం తెలిసిందే. ముదిరిపోయిన బెండకాయ్ అంటూ..ప్లే బాయ్(Play Boy) అంటూ.. సుధీర్ ను ఓ ఆటఆడుకున్నారు కోస్టార్స్ ఈక్రమంలోసుధీర్ పెళ్ళి చేసకోవడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది.

జబర్దస్త్(Jabardasth)షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్... కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. టాలీవుడ్ లో హీరోగా ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. వయసు పెరిగిపోతున్నా సుధీర్ మాత్రం పెళ్లి జోలికి వెళ్లలేదు. తన తోటి కమెడియన్స్ అందరూ పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయారు.. కాని సుధీర్ మాత్రం తనతమ్ముడికి పెళ్ళి చేసి.. తాను బ్యాచిలర్ గానే ఉన్నాడు. యాంకర్ రష్మితో సుధీర్ కి లవ్ అఫైర్ ఉందంటూ ఎప్పటి నుంచో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జబర్థస్త్ లో వీరి ప్రేమ కథకు భారీస్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. వీరిని జంటగా అభిమానించేవారే ఎక్కువ.

అయితే నిజంగా ప్రేమికులే అని అనిపించేంత క్లోజ్ గా ఉండే వీరు.. ఎంతో చనువుగా కనిపించే వీరిద్దరూ తమ మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. కాని షోలో మాత్రం ఒకరికి మరొకరు అన్నట్టుగా.. సిగ్గుపడుతూ.. షో చేస్తుంటారు. దాంతో వీరి ప్రేమ నిజమేనని.. పెళ్ళి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు చాలా సార్లు గుప్పుమన్నాయి. ఇక తాజాగా సుధీర్ పెళ్ళి మ్యాటర్ మరోసారి వార్తల్లో నిలుస్తోంది.

తాజాతా సుధీర్ గురించి మరో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడని సమాచారం. అయితే అతను చేసుకోబోయేది రష్మీనా అని మీకు డౌట్ రావచ్చు..కాని సుధీర్ వరుసకు మరదలు అయ్యే తన బంధువుల అమ్మాయినే ఆయన పెళ్లి చేసుకుంటున్నాడని చెపుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంత మంది నెటిజన్లు మరి రష్మీ పరిస్థితి ఏంటీ భయ్య అని కామెంట్లు చేస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే... ఇటీవల ఆయన నటించిన గాలోడు సినిమా కాస్త బెటర్ గా థియేటర్లలో ఆడింది. దాంతో హీరోగా ఇప్పుడిప్పుడే నిలబడుతున్నాడు సుధీర్.

Updated On 16 April 2023 11:49 PM GMT
Ehatv

Ehatv

Next Story