నేడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌(Subhas Chandra Bose) 127వ జయంతి. జనవరి 23, 2024న పరాక్రమ్ దివస్‌ అని.. దేశవ్యాప్తంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సుభాష్‌ చంద్రబోస్‌ ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌కు రాజీనామా చేసిన లేఖ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

నేడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌(Subhas Chandra Bose) 127వ జయంతి. జనవరి 23, 2024న పరాక్రమ్ దివస్‌ అని.. దేశవ్యాప్తంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సుభాష్‌ చంద్రబోస్‌ ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌కు రాజీనామా చేసిన లేఖ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. 1921లో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనేందుకు తాను ఇండియన్ సివిల్‌ సర్వీసెస్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు స్టేట్ సెక్రటరీ ఎడ్విన్ మోంటాగుకు లేఖ రాస్తూ ఇండియన్ సివిల్‌ సర్వీస్‌లోని ప్రొబెషనర్ల జాబితా నుంచి తన పేరును తొలగించాలని లేఖలో ఆయన కోరారు.

ఈ లేఖను ప్రస్తుత IFS అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన నేతాజీ గురించి వ్యాఖ్యానిస్తూ “ఏప్రిల్ 22, 1921న సుభాష్ బోస్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనేందుకు ఇండియన్ సివిల్ సర్వీస్‌కు రాజీనామా చేశారు. ఒక గొప్ప ఉద్యమంలో పాల్గొనేందుకు ఆయన రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారు. అప్పుడు అతని వయస్సు 24 సంవత్సరాలని కస్వాన్‌ వివరించారు. నేషనల్ ఆర్కైవ్స్ ఇండియా నుంచి ఈ లేఖను సేకరించినట్లు సమాచారం.

Updated On 23 Jan 2024 2:06 AM GMT
Ehatv

Ehatv

Next Story