Shah Rukh Khan and SS Rajamouli : అరుదైన ఘనత సాధించిన షారుఖ్ ఖాన్, రాజమౌళి.. ఇంతకీ విషయం ఏంటంటే..?
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లెజండరీ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli).. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఈ ఇద్దరు అరుదైన ఘనత సాధించారు. భారతదేశానికే తలమానికం అయ్యారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇద్దరు తారలు.. మన దేశానికే తలమానికంగా నిలిచారు. ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలులుగా ఘనతకెక్కారు. అందుల్ మన తెలుగువారు ఉండటం మనం గర్వించదగ్గ విషయం. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీని పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా.. హాలీవుడ్ రేంజ్ లో నిలబెట్టారు రాజమౌళి. ఆస్కార్ సాధించడంతో..
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లెజండరీ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli).. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఈ ఇద్దరు అరుదైన ఘనత సాధించారు. భారతదేశానికే తలమానికం అయ్యారు.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇద్దరు తారలు.. మన దేశానికే తలమానికంగా నిలిచారు. ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలులుగా ఘనతకెక్కారు. అందులో మన తెలుగువారు ఉండటం మనం గర్వించదగ్గ విషయం. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీని పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా.. హాలీవుడ్ రేంజ్ లో నిలబెట్టారు రాజమౌళి. ఆస్కార్ సాధించడంతో.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా గురించి చర్చించుకునేలా చేశాడు జక్కన్న. రికార్డు స్థాయిలో వసూళ్ల రాబట్టడంతోపాటు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. ఆ చిత్రంలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు ప్రతిష్ఠాత్మక ‘ఆస్కార్’ అవార్డు వరించింది.
ఇక షారుక్ ఖాన్ విషయానికి వస్తే.. రీసెంట్‌గా హిందీ యాక్షన్ థ్రిల్లర్ పఠాన్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ రికార్డ్స్ ను తిరగరాశాడు బాద్ షా. ఫెయిల్యూర్స్ మధ్య కొట్టు మిట్టాడుతున్న బీ టౌన్ ను తల ఎత్తుకునేలా చేశాడు షారుఖ్ ఖాన్. విడదలకు ముందు ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైన ఈ సినిమా.. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది.
ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli), బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఈ ఇద్దరు అరుదైన ఘనత సాధించారు. 2023కు గానూ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ (Time magazine) రిలీజ్ చేసిన 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2023 (100 most influential people of 2023)లిస్ట్ లో చోటు దక్కించుకున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఈ ఇద్దరు స్టార్స్ కే అవకాశం దక్కడం విశేషం. అందులోనే తెలుగు దర్శకుడికి చోటు దగ్గకడంతో అందరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు.
కాగా, పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు, ప్రముఖులతో కూడిన జాబితాను ‘టైమ్స్’ గురువారం విడుదల చేసింది. రాజమౌళి, షారుక్‌తోపాటు మరికొంతమందికి ఈ లిస్ట్‌లో చోటు దక్కింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, హాలీవుడ్ తార ఏంజెలా బాసెట్, ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ, న్యాయనిర్ణేత పద్మలక్ష్మి తదితరులు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వంద మంది వ్యక్తులు జాబితాలో చోటు దక్కించుకున్నారు.