ఐపీఎల్‌-2023 14వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జ‌ట్ల‌ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ జ‌ట్టులో రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ అద్భుత ఆటతీరును ప్రదర్శించారు. దీంతో హైదరాబాద్ ఈ సీజ‌న్‌లో మొద‌టి విజయాన్ని నమోదు చేసుకోగలిగింది. అయితే.. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జ‌ట్టు ఓన‌ర్‌ కావ్య మారన్ కెమెరామెన్ పై మండిప‌డిన‌ వీడియో సోషల్ మీడియాలో […]

ఐపీఎల్‌-2023 14వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జ‌ట్ల‌ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ జ‌ట్టులో రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ అద్భుత ఆటతీరును ప్రదర్శించారు. దీంతో హైదరాబాద్ ఈ సీజ‌న్‌లో మొద‌టి విజయాన్ని నమోదు చేసుకోగలిగింది. అయితే.. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జ‌ట్టు ఓన‌ర్‌ కావ్య మారన్ కెమెరామెన్ పై మండిప‌డిన‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏం జ‌రిగిందో తెలుసుకుందాం.

పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓన‌ర్‌ కావ్య మారన్‌ను కెమెరామెన్ బిగ్ స్క్రీన్‌పై చూపించాడు. అప్పుడు ఆమె టెన్ష‌న్‌లో విసుగుగా ఉంది. బిగ్ స్క్రీన్‌పై త‌న‌ను తాను చూసుకున్న‌ కావ్య మారన్.. వెంట‌నే కోపంతో కెమెరామెన్ ను తిడుతూ సైగ చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన స్టైల్‌లో స్పందిస్తున్నారు. ఇదిలావుంటే.. కావ్య మారన్.. కళానిధి మారన్ కూతురు. కళానిధి మారన్ స‌న్ గ్రూప్ సంస్థ‌ల అధిప‌తి. ఇండియ‌న్‌ బిలియనీర్. మీడియా మొగల్ గా పేరుంది. ఆయ‌న‌ టెలివిజన్ ఛానెల్‌లు, వార్తాపత్రికలు, వారపత్రికలు, FM రేడియో స్టేషన్లు, DTH సేవలు, సినిమా ప్రొడక్షన్ హౌస్ లు స‌హా క్రికెట్ టీమ్ వ‌ర‌కు అన్ని రంగాల‌లో పెట్టుబ‌డులు పెట్టిన వ్యాపార‌వేత్త‌.

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పంజాబ్ కింగ్స్ 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ ల‌క్ష్యాన్ని హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయి సాధించింది. ఆరంభంలో 13 పరుగులకే హ్యారీ బ్రూక్ ఔటయ్యాడు. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి ఇన్నింగ్సును చ‌క్క‌దిద్దారు. 21 పరుగుల వద్ద మయాంక్ ఔటయ్యాడు. త‌ర్వాత‌ రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్‌తో జతకట్టాడు. రాహుల్ 48 బంతుల్లో 74 పరుగులు చేశాడు. మార్క్రామ్ 37 పరుగులతో ఆక‌ట్టుకున్నాడు.

ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది తొలి విజయం. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 72 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగ, ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్‌కి ఇదే తొలి ఓటమి.

Updated On 10 April 2023 9:29 PM GMT
Yagnik

Yagnik

Next Story