సారీ నాగబాబు ఎవడో నాకు తెల్వదు: బాలయ్య

నాగబాబు (Nagababu)కు త్వరలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. మొదట టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. ఆ పదవి బీఆర్ నాయుడికి (BR Naidu) ఇవ్వడంతో రాజ్యసభకు పంపిస్తారని ఊహాగానాలు అందుకున్నాయి. అయితే తాజాగా టీడీపీకి రెండు, బీజేపీకి ఒక రాజ్యసభ ఖరారైన నేపథ్యంలో దీంతో జనసేన నేత నాగబాబుకు కేబినెట్ బెర్త్ దక్కనున్నట్లు సమాచారం. జనసేన విజయంలో కీలకంగా నాగబాబు కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే నాగబాబు గతంలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన క్లిప్ వైరలవుతోంది. ఆ ఇంటర్వ్యూలో నాగబాబును బాలయ్య బాబు గురించి చెప్పాలని కోరారు. బాలయ్య అంటే పాత యాక్టర్ కదా.. నేరం-శిక్ష సినిమాలో నటించిన బాలయ్య పెద్ద ఆర్టిస్టు అని నాగబాబు అన్నారు. అయితే బాలయ్యబాబు (Balayya Babu) ఎవరు అని మరోసారి ప్రశ్నించగా ఆయనెవరో నాకు తెలియదని మళ్లీ అదే సమాధానం ఇచ్చారు. నాగబాబుకు మంత్రివర్గంలో చోటు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వీడియో వైరలవుతోంది. అయితే దీనిపై బాలకృష్ణ స్పందించారు. తన ట్విట్టర్ హ్యాండిల్‌లో కూడా 'సారీ.. నాగబాబు ఎవడో నాకు తెలియదు' అంటూ ట్వీట్ చేశారు. బాలకృష్ణ వేసిన ట్వీట్‌పై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఏ ఉద్దేశంతో అలా ట్వీట్ చేశారోనని చర్చించుకుంటున్నారు.
