బాలీవుడ్‌ నటుడే అయినప్పటికీ సోనూసూద్‌(Sonu Sud) దేశమంతటా ఆయనకు అభిమానులున్నారు. ఆయన మంచితనం ఆయనను రియల్‌ హీరోను చేసింది. కరోనా నుంచి తప్పించుకోడానికి దేశం యావత్తూ లాక్‌డౌన్‌ను విధించుకున్న సమయంలో సోనూసూద్‌ ఎంతో మందికి ఆపన్నహస్తం అందించారు. ఇప్పటికీ తన సేవను కొనసాగిస్తున్నారు.

బాలీవుడ్‌ నటుడే అయినప్పటికీ సోనూసూద్‌(Sonu Sood) దేశమంతటా ఆయనకు అభిమానులున్నారు. ఆయన మంచితనం ఆయనను రియల్‌ హీరోను చేసింది. కరోనా నుంచి తప్పించుకోడానికి దేశం యావత్తూ లాక్‌డౌన్‌ను విధించుకున్న సమయంలో సోనూసూద్‌ ఎంతో మందికి ఆపన్నహస్తం అందించారు. ఇప్పటికీ తన సేవను కొనసాగిస్తున్నారు. సోనూసూద్‌ను చూసి ఎంతోమంది ఆయన అడుగుజాడలలో నటించారు.

సినిమా షూటింగులతో బిజీగా ఉంటున్నప్పటికీ నిత్యం సోషల్‌ మీడియాలో(social media) యాక్టివ్‌గా ఉంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా అందుబాటులో ఉంటూ చేతనైనంత సాయం చేస్తున్నారు సోనూసూద్‌. ప్రస్తుతం ఆయన ప్రాజెక్ట్‌ 'MTV రోడీస్‌ సీజన్‌ 19′('MTV Roadies Season 19') షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇదే ప్రాజెక్ట్‌లో రియా చక్రవర్తి(Rhea Chakraborty) కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ హిమాచల్‌ప్రదేశ్‌లో(Himachal) జరగుఉతోంది. అక్కడ సెట్‌లో ఉన్నవారి కోసం సోనూ సుద్ దోశలు(Dosa) వేశారు.

ఎవరికి ఎలాంటి దోశ కావాలో అడిగి మరీ వారికి దోశలు చేసి ఇచ్చారు. ఇదే సమయంలో నటి రియా చక్రవర్తి అక్కడకు వచ్చారు. మీకు ఎలాంటి దోశ కావాలి అంటూ రియా చక్రవర్తిని అడిగాడు సోనూసూద్‌.. ఆమె కోరుకున్న టిఫిన్‌ను సిద్ధం చేసి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోనూసూద్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) పోస్ట్‌ చేశారు. దీనిపై సోనూ అభిమానులు భిన్న రకాలుగా రియాక్టయ్యారు. మీరంటే మాకెంతో గౌరవమని, అది ఎప్పటికీ కొనసాగుతుందని, ఈ చర్యతో మీపై గౌరవం మరింత పెరిగిందని ఒకరు కామెంట్‌ చేశారు.

ఈ వీడియోను చూసిన బాలీవుడ్‌ యువ నటుడు దివంగత సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌(Shushanth singh Rajput) ఫ్యాన్స్‌ మాత్రం కొంత నారాజ్‌ అయ్యారు. రియా చక్రవర్తికి దూరంగా ఉండాలని సోనూను కోరారు. మీరు ఆమెకు దోశెలు చేసి పెట్టడం మాకు ఏ మాత్రం నచ్చలేదంటూ కామెంట్లు పెడతున్నారు...సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని కోంతకాలం పాటు రియా జైలులో ఉన్న విషయం తెలిసిందే.

Updated On 3 July 2023 6:43 AM GMT
Ehatv

Ehatv

Next Story