✕
Anchor shyamala : యాంకర్ శ్యామలపై ట్రోల్స్..!
By EhatvPublished on 13 Dec 2023 2:56 AM GMT
యాంకర్ శ్యామల(Shyamala).. ఈ పేరు తెలుగురాష్ట్రాలకు సుపరిచితమే. అందం, నటన, యాంకరింగ్‌తో తెలుగు ప్రేక్షకులను ఆమో అలరిస్తూ వస్తోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ప్రైవేట్ ఈవెంట్లు(Events) సహా పలు సినీ ఫంక్షన్లలోనూ యాంకరింగ్‌తో అకట్టుకుంటోంది. షోలు, సినిమాలు(Cinema) చేస్తూ చాలా బిజీగా ఉన్నప్పటికీ యాంకర్ శ్యామల సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూగా తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తన పర్సనల్(Personal), వంటలు, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన వీడియోలను(Videos) సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటుంది. దీంతో యాంకర్ శ్యామలకు క్రమేణా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువైంది. పలు సీరియళ్లలోనూ శ్యామల నటించింది. 'లయ', 'అభిషేకం', 'గోరింటాకు' లాంటి సీరియళ్లలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

x
anchor shyamala
-
- మరోవైపు రాజకీయాలపై(Politics) కూడా దృష్టిసారించింది. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ పార్టీలో(YSRCP) యాంకర్ శ్యామల చేరింది. తన భర్తతో కలిసి వైసీపీ తరపున ప్రచారం కూడా చేసింది. తెలంగాణలో(Telangana) షర్మిల పార్టీ పెట్టినప్పుడు షర్మిలను, బ్రదర్ అనిల్‌ను ఈ జంట కలవడమే కాకుండా.. షర్మిల (YS Sharmila)పాదయాత్రలో కూడా పాల్గొంది. ఆ తర్వాత రాజకీయ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనకపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం రాజకీయ పోస్టులు పెడుతూ వచ్చింది.
-
- ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల సమయంలో శ్యామల బీఆర్స్(BRS) పార్టీవైపు మొగ్గు చూపింది. మన జీవన ప్రయాణం సాఫీగా ముందుకు సాగాలంటే బీఆర్ఎస్ ఓటు వేసి గెలిపించాలని ట్విట్టర్(Twitter) ద్వారా కోరింది. మీ భవిష్యత్ కోసం బీఆర్ఎస్ ఓటు వేయాలని ఓటింగ్ సందర్భంగా తన ఫ్యాన్స్‌ను కోరింది. అంతేకాదు గ్రామాల్లో వాడే టార్చ్లైట్ల షేర్ చేస్తూ ఇవి మన రైతులు ఎప్పుడు ఉపయోగించారో తెలుసా అంటూ ప్రశ్నించింది. నాకు తెలిసి ఇవి మన రైతుల కాంగ్రెస్(Congress) పార్టీ హయాంలో అర్ధరాత్రి మోటార్లు ఆన్ చేసేందుకు వెళ్లినప్పుడు ఈ టార్చ్లైట్లను9Tourch light) బాగా ఉపయోగించేవారని మరో ట్వీట్ చేసింది. కాంగ్రెస్ స్క్రాచ్ కార్డ్ గీస్తే 3 గంటల కరెంట్ అని.. బీఆర్ఎస్ స్క్రాచ్ కార్డ్ గీస్తే 24 గంటల కరెంట్ అని మరో ట్వీట్ వదిలింది. అటు ఏపీ రాజకీయాలపై కూడా పలు రకాల పోస్టులు చేస్తూ వచ్చింది. ఏపీ సీఎం జగన్‌కు(CM Jagan) అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చింది.
-
- అయితే ఎన్నికల ఫలితాలు రావడం.. బీఆర్ఎస్ ఓడిపోవడంతో పలువురు నెటిజన్లు ఇప్పుడు యాంకర్(Anchor) శ్యామల ఎక్కడా.. అని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ అనుకూలంగా ప్రచారం చేసి ఓటమి తర్వాత తన మొహమే చూపించడం లేదని.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన శ్యామల ఇప్పుడు తన మొహాన్ని చూపించేందుకు భయపడుతుందోని నెటిజన్లు ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో(Social media) తను షేర్ చేసిన పోస్టులను ట్యాగ్ చేస్తూ ఎన్నికల ఫలితాలపై మీ స్పందన ఏంటని ప్రశ్నిస్తున్నారు. 'కారు(Car) కోసం ప్రచారం చేసిన మీకు.. ఆ పార్టీ నుంచి ఎన్నికార్లు' వచ్చాయో చెప్పాలంటున్నారు. సెలబ్రిటీలకు కార్లు గిఫ్ట్ ఇచ్చి ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకున్నారని బీఆర్ఎస్పై కాంగ్రెస్ అనుకూల వర్గం వారు విమర్శలు గుప్పించారు. ఈ ట్రోల్స్‌పై(Trolls) యాంకర్ శ్యామల ఎలా స్పందిస్తుందో చూడాలి..!

Ehatv
Next Story