స్టార్‌ హీరోయిన్‌ త్రిషపై (Trisha Krishnan)నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ (Mansoor ali Khan) చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి. లియో (Leo) సినిమాలో త్రిషతో రేప్‌ సీన్లు ఉంటాయని అనుకున్నానని, అలాంటి సీన్లు లేకపోవడం నిరాశ కలిగించిందని మన్సూర్‌ అలీఖాన్‌ కామెంట్‌ చేశాడు. అతడి వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా మండిపడ్డారు. ఇకపై అతడితో నటించేది లేదని స్పష్టం చేశారు. సినీ ప్రముఖులంతా త్రిషకు మద్దతు తెలుపుతూ మన్సూర్‌ను తిట్టిపోస్తున్నారు.

స్టార్‌ హీరోయిన్‌ త్రిషపై (Trisha Krishnan)నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ (Mansoor ali Khan) చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి. లియో (Leo) సినిమాలో త్రిషతో రేప్‌ సీన్లు ఉంటాయని అనుకున్నానని, అలాంటి సీన్లు లేకపోవడం నిరాశ కలిగించిందని మన్సూర్‌ అలీఖాన్‌ కామెంట్‌ చేశాడు. అతడి వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా మండిపడ్డారు. ఇకపై అతడితో నటించేది లేదని స్పష్టం చేశారు. సినీ ప్రముఖులంతా త్రిషకు మద్దతు తెలుపుతూ మన్సూర్‌ను తిట్టిపోస్తున్నారు. ఇక దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (South india film actors association) ఓ అడుగు ముందుకేసి ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ మన్సూర్‌ అలీఖాన్‌కు నోటీసులు (Notices) జారీ చేసింది. మన్సూర్‌ మాత్రం తాను త్రిషకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాను సరదాగా అన్న మాటలను కొందరు కావాలనే వక్రీకరించారని మన్సూర్‌ అంటున్నాడు. ఇదిలా ఉంటే ఈ వివాదంపై గాయని చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) తనదైన శైలిలో రియాక్టయ్యారు. మన్సూర్‌ అలీఖాన్‌ మాత్రమే అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, గతంలో హీరోయిన్లపై (Heroines) చాలా మంది అనుచిత వ్యాఖ్యలు చేశారని చెబుతూ నటుడు రాధా రవికి (Actor Radha Ravi) సంబంధించిన ఓ వీడియోను సోషల్‌ మీడియాలో (Social Media) షేర్‌ చేశారు. రాధా రవి ఓ సినిమా (Cinema) వేడుకలో మాట్లాడుతున్న వీడియోను చిన్మయి శ్రీపాద ట్విట్టర్‌లో (Twitter) షేర్‌ చేశారు. అందులో రాధా రవి మాట్లాడుతూ ' నాకు హిందీ (Hindi) భాష రాదు. ఒకవేళ వచ్చి ఉంటే ఐశ్వర్యను (Aishwarya Rai) రేప్‌ చేసేవాడిని. ఎందుకంటే అక్కడి వారు ఎలాగూ నాకు మంచి పాత్రలు ఇచ్చేవారు కాదు. అత్యాచారం చేసే పాత్రలే ఇచ్చవారు' అని అన్నాడు. రాధారవి మాటలకు అక్కడున్నవారు నవ్వారు. 'ఐశ్వర్య రాయ్‌ని రేప్‌ చేస్తానని రాధా రవి అంటే అంతా జోక్‌గా (Joke) తీసుకొని నవ్వేశారు. అలాంటి వ్యాఖ్యలే చేసిన మన్సూర్‌ అలీఖాన్‌పై చర్యలు తీసుకోవాలని అంతా డిమాండ్‌ (Demand) చేస్తున్నారు. మరి రాధ రవి వ్యాఖ్యల మీద ఎవరూ స్పందించకపోవడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని ఉంది’అని చిన్మయి శ్రీపాద ట్వట్‌ చేశారు. అయితే చిన్మయి షేర్‌ చేసిన వీడియోపై నెటిజన్లు తలో రకంగా స్పందిస్తున్నారు. అతడు రేప్‌ సీన్ల గురించి మాత్రమే మాట్లాడడని కొందరంటే, మరికొందరు రాధా రవిపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు.

Updated On 22 Nov 2023 3:10 AM GMT
Ehatv

Ehatv

Next Story