తమిళనాట మీటు ఉద్యమంలో(Me Too Protest).. సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. హాట్ టాపిక్ గా మారింది సింగర్ చిన్మయి. సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయిన చిన్మయి వివాదాలలో కూడా మొదటి వరసలో ఉంటోంది. . అయితే ఈక్రమంలో ఎంతో మందిపై విమర్షలు చేసిన సింగర్ చిన్మయి..

తమిళనాడు సీఎం స్టాలిన్(Stalin) పై ఫైర్అయ్యింది.. ప్రముఖ సింగర్ చిన్మయి(Chinmayi). సోషల్ మీడియా వేదికగా సీఎంకు ఓ లెటర్ ను రిలీజ్ చేసింది బ్యూటీ. తాజాగా ఆమె ఓ పోస్ట్ లో.. సంచలన వ్యాఖ్యలు చేసింది స్టార్ ఆర్టిస్ట్ .

తమిళనాట మీటు ఉద్యమంలో(Me Too Protest).. సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. హాట్ టాపిక్ గా మారింది సింగర్ చిన్మయి. సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయిన చిన్మయి వివాదాలలో కూడా మొదటి వరసలో ఉంటోంది. . అయితే ఈక్రమంలో ఎంతో మందిపై విమర్షలు చేసిన సింగర్ చిన్మయి.. తమిళ సినీ పెద్దలపై కూడా ఆరోపణలు చేసింది. మరీ ముఖ్యంగా.. తమిళ పాటల రచయిత వైరముత్తు(Vairamuthu) మీద కూడా ఆరోపణలు చేయడం.. తమిళ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆ విమర్షల ప్రభావంతో.. పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చలకు దారి తీశాయి. ఆ వ్యాఖ్యల కారణంగా తమిళ్ ఇండస్ట్రీ చిన్మయిని బ్యాన్ చేసింది.

ఈక్రమంలో వైరిముత్తుకు సబంధించి చిన్మయి పోరాటం సాగుతున్న క్రమంలో.. తాజాగా వైరి ముత్తు పుట్టినరోజు(Birthday) సందర్భంగా.. తమిళనాడు సీఎం స్టాలిన్(CM Stalin) స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ విషయంలో సీఎంను ప్రశ్నిస్తూ.. ఆమె ఓ లేఖ రిలీజ్ చేసింది. సీఎం స్టాలిన్ పై మండి పడింది చిన్మయి. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంటికి వెళ్లి మరీ పుట్టినరోజు శుభాకాంక్షలు ఎలా చెప్తారు..? అంటూ చిన్మయి ఫైర్ అయ్యింది.

మీటూ ఉద్యమంలో భాగంగా అతని మీద ఆరోపణలు చేసినందుకు 2018 నుంచి నా మీద తమిళ ఇండస్ట్రీ కక్ష కట్టిందిమరి నేను గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌‌గా ఎన్నో అవార్డులు గెలుచుకున్నా. అయినా నన్ను బ్యాన్ చేశారు. గత ఐదేళ్లుగా నరకం చుస్తున్నాను అన్నారు. న్యాయం కోసం కోర్ట్ లో కేసు వేశాను..దాంతో న్యాయం అడుగుతావా అని నా మీద కక్ష పెంచుకున్నారు. అసలు వేధించేవాడు కవి ఎలా అవుతాడు.. దశాబ్దాల క్రితం జన్మించాడు... ఆదర్శంగా ఉండాల్సిన వాడు.. కాని అతను ఏ స్త్రీ మీద అయినా చేయి వేయగలుగుతాననుకుంటాడు.. అంటూ మండిపడింది చిన్మయి.

ఇలాంటి పనులు చేసిన వారికి పద్మ అవార్డులు, సాహిత్య నాటక అకాడమీ లాంటి గొప్ప గొప్ప అవార్డులు ఎలా ఇచ్చారు. జాతీ అవార్డ్ ఎలా వచ్చాయి. అవన్నీ అధికారం అడ్డుపెట్టుకునిచేసినవే.. అతని అధికారం అలాంటిది. అందుకే అతని వేధింపుల గురించి చెప్పలేకపోయాం. రాజకీయ నాయకులు మహిళల భద్రతల గురించి మాట్లాడుతుంటే.. సిగ్గుగా అనిపిస్తుంది అంటూ వాపోయింది.

Updated On 14 July 2023 4:05 AM GMT
Ehatv

Ehatv

Next Story