టాటూ ఇపుడు ఒక ఫ్యాషన్, ట్రెండ్ కూడా...దీన్నే ఒకప్పుడు పచ్చబొట్టు అనేవారు . ఇది చర్మం మీద వేయించుకొనే ఒకరకమైన గుర్తులు .. ఇవి వారివారి అభిరుచులను బట్టి వేయించుకొనేవి . . కొన్ని జ్ఞాపకాలను మరచి పోవడం ఒక వరం .అంటారు .మరచిపోకపోవడం ఒక శాపం అంటారు ...నిజమే కొన్ని జ్ఞాపకాలు మనసును బాధ పెడుతాయి ...మరికొన్ని సంతోషాన్ని కలిగిస్తాయి . మనసులోని భావాలకు ఓ రూపు ఇవ్వడమే టాట్టూ ... పచ్చబొట్టు ఒక్కసారి వేస్తె […]

టాటూ ఇపుడు ఒక ఫ్యాషన్, ట్రెండ్ కూడా...దీన్నే ఒకప్పుడు పచ్చబొట్టు అనేవారు . ఇది చర్మం మీద వేయించుకొనే ఒకరకమైన గుర్తులు .. ఇవి వారివారి అభిరుచులను బట్టి వేయించుకొనేవి . . కొన్ని జ్ఞాపకాలను మరచి పోవడం ఒక వరం .అంటారు .మరచిపోకపోవడం ఒక శాపం అంటారు ...నిజమే కొన్ని జ్ఞాపకాలు మనసును బాధ పెడుతాయి ...మరికొన్ని సంతోషాన్ని కలిగిస్తాయి . మనసులోని భావాలకు ఓ రూపు ఇవ్వడమే టాట్టూ ... పచ్చబొట్టు ఒక్కసారి వేస్తె చెరిపి వేయడం కష్టం .

చాలా మంది యువతకు పచ్చబొట్టు అంటే అంత ఎంత క్రేజీ కాదు .. అంతే కాదు ఫిలిం సెలబ్రెటీలు టాటూలు వేసుకోవడం కొత్తేమీ కాదు. యంగ్ హీరోలు చాలామంది ఆ బాట పడుతున్న వాళ్లే. వాళ్లు వేయించుకునే టాటూల వెనుక కొన్ని కథలు మరికొన్ని కన్నీళ్లు కూడా ఉంటాయి. అయితే పచ్చబొట్లు కొంతమంది తమ ప్రేమకు గుర్తుగా వేయించుకుంటే ...మరికొంతమంది తమ ఇష్ట దైవాల బొమ్మలను వేయించుకుంటారు

పూర్వకాలం లో పచ్చబొట్టు అనేది శరీరానికి రక్షణ కల్పిస్తుందని, శక్తిని సమకూరుస్తుందని, గిరిజనుల విశ్వాసం. అయితే ఒక ప్రత్యేకమైన తెగకు గుర్తుగాను, ఒక అంతస్తుకు చిహ్నంగానూ వారు పచ్చబొట్టును ఉపయోగించేవారు . ఇప్పుడు ఫ్యాషన్ కు, ప్రేమకు గుర్తు గా వేసుకునే ఈ టాటూ ...మరో వైపు మచ్చలకు, కుట్ల ఆనవాళ్లకు తిరుగులేని పరిష్కారం చూపుతున్నారు టాటూ ఆర్టిస్టులు. గాయం మచ్చలపై అద్భుతమైన టాటూలు వేస్తూ సరికొత్త ట్రెండ్‌కు ప్రాణం పోస్తున్నారు. శస్త్రచికిత్సకు గురై ఏర్పడిన మచ్చలు, చేతివేళ్ల గాయాలు, మెడపై ముడతలు, ఆర్థోపెడిక్‌ ఆపరేషన్ల తాలూకు గుర్తులు, కావేవీ టాటూలకు అనర్హం అంటున్నారు.

ఈ తరహా టాటూలకు హైదరాబాద్‌లోనూ ఆదరణ పెరుగుతున్నది. గాయాల బాధితులు నిర్భయంగా ముందుకొచ్చి నచ్చిన టాటూలు వేయించుకుంటున్నారు. ఇదేమంత తేలికైన వ్యవహారం కాదు. గాయం అయిన చోట సాధారణ చర్మం అతి మందంగానో, మహా సున్నితంగానో ఉంటుంది. కాబట్టి, టాటూ వేయడం చాలా కష్టం. అయినా, అద్భుతాలను ఆవిష్కరిస్తున్నారు టాటూ ఆర్టిస్టులు.

Updated On 24 Feb 2023 7:59 AM GMT
Ehatv

Ehatv

Next Story