మాల్దీవుల్లో (Maldives)హాలిడే కోసం ప్రతి ఏటా ఎంతో మంది పర్యాటకులు వెళుతుంటారు .అక్కడి బీచ్ (beach)అందాలను ఆస్వాదిస్తూ సేదతీరి హ్యాపీ ఎంజాయ్ చేస్తుంటారు .కొంత మంది సాహసోపేతమైన డైవింగ్ లాంటివాటికి ఎంతో ఇష్టపడి మరి వెళ్తుంటారు . ఇలానే హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేయటానికి ,మాల్దీవులు వెళ్లిన ఒక జంటకు అనుకోని సంఘటన ఎదురయ్యింది .ఏమి జరిగింది అంటే

మాల్దీవుల్లో (Maldives)హాలిడే కోసం ప్రతి ఏటా ఎంతో మంది పర్యాటకులు వెళ్తుంటారు. అక్కడి బీచ్ (beach)అందాలను ఆస్వాదిస్తూ సేదతీరి హ్యాపీ ఎంజాయ్ చేస్తుంటారు. కొంత మంది సాహసోపేతమైన డైవింగ్ లాంటివాటికి ఎంతో ఇష్టపడి మరి వెళ్తుంటారు. ఇలానే హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేయటానికి ,మాల్దీవులు వెళ్లిన ఒక జంటకు అనుకోని సంఘటన ఎదురయ్యింది .ఏమి జరిగింది అంటే ?

కెర్వెల్లో(Cervello) (30)ఇబ్రహీం షఫీజ్(Ibrahim Shafeeg,)(37) అనే జంట మాల్దీవుల్లో( Maldives).హాలిడే ట్రిప్ కోసం వెళ్లడం జరిగింది. బీచ్ అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంది ఈ జంట .ట్రిప్ లో భాగంగా డైవింగ్ చేయాలనీ సముద్రంలోకి వెళ్లారు . సముద్రం మధ్యలో అన్ని జాగ్రత్తలు తీసుకొని వీరిని డైవింగ్ కి పంపడం జరుగుతుంది . డైవింగ్ కి వెళ్లిన ఈ జంట సముద్రంలో రక రకాల చేపల మధ్య అందంగా డైవ్ చేస్తూ ఆ దృశ్యాలను తమ కెమెరాలో కూడా చిత్రీకరిస్తున్నాడు బాయ్ ఫ్రెండ్ ఇబ్రహీం షఫీజ్(37) (Ibrahim Shafeeg,)ఇంతలో ఒక పెద్ద సొర చేప అక్కడికి వచ్చింది .అప్పటికే చాలా రకాల చేపల మధ్య డైవ్ చేస్తున్న వారికీ ఏ మాత్రం అనుమానము లేదా భయం రాలేదు. ఉన్నటుండి ఒక పెద్ద సొరచేప కెర్వెల్లో (Cervello)భుజాన్ని కొరికింది . ఆమె భుజానికి 6 ఇంచుల వరకు తీవ్ర గాయమైంది .

సొరచేప(Shark) దాడితో భయపడిన ఈ జంట వెంటనే నీటి నుండి బయటకు రావటంతో ప్రమాదం తప్పింది. అప్పటికే 45 నిమిషాల నుండి ఈ జంట చేపల మధ్య డైవింగ్(Diving) చేస్తున్నారు . జరిగిన ఘటన కు కెర్వెల్లో(Cervello) భయపడలేదని చెప్పింది . అది చిన్న గాయంగా భావిస్తున్నాను అని చెప్పింది. కెర్వెల్లో (Cervello)భుజానికి సొరచేప చేసిన గాయం తాలూకు వీడియో ఇంటర్నెట్ లో ఇప్పుడు వైరల్ గా మారింది .

Updated On 15 April 2023 5:42 AM GMT
rj sanju

rj sanju

Next Story