సీనియర్‌ నటి అన్నపూర్ణకు(Annapurna) సినిమాల్లో వేషాలు తగ్గాయి. ఎప్పడో కానీ వెండితెరపై కనిపించడం లేదు. 13 ఏళ్ల వయసులోనే నాటకాల్లో నటించడం మొదలు పెట్టిన అన్నపూర్ణకు దాసరి నారాయణరావు(Dasari Narayana Rao) సినిమాల్లో అవకాశం ఇచ్చారు. స్వర్గం నరకం సినిమాతో ఆమె హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. అయితే కథానాయిక వేషాలు దొరకకపోవడం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. చిన్నవయసులోనే తల్లివేషాలు వేయడం మొదలుపెట్టారు.

సీనియర్‌ నటి అన్నపూర్ణకు(Annapurna) సినిమాల్లో వేషాలు తగ్గాయి. ఎప్పడో కానీ వెండితెరపై కనిపించడం లేదు. 13 ఏళ్ల వయసులోనే నాటకాల్లో నటించడం మొదలు పెట్టిన అన్నపూర్ణకు దాసరి నారాయణరావు(Dasari Narayana Rao) సినిమాల్లో అవకాశం ఇచ్చారు. స్వర్గం నరకం సినిమాతో ఆమె హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. అయితే కథానాయిక వేషాలు దొరకకపోవడం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. చిన్నవయసులోనే తల్లివేషాలు వేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు బామ్మ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అలరిస్తున్నారు. అయితే ఇటీవల ఆమె ఆడ‌వాళ్ల‌ను(Ladies) కించ‌ప‌రుస్తూ కొన్ని మాటలన్నారు. అవి కాస్తా సోషల్‌ మీడియాలో(Social Media) వైరల్‌ అయ్యాయ. ఆమె ఏమన్నారంటే 'అర్ధ‌రాత్రి స్వ‌తంత్ర్యం అనగానే ఆ రోజుల్లో ఆడ‌వాళ్లు బ‌య‌ట‌కు వ‌చ్చేవాళ్లా? అసలు ఆడ‌దానికి స్వాతంత్య్రం ఎందుకు కావాలి? రాత్రి 12 గంట‌ల‌ త‌ర్వాత ఆడవాళ్లకు ఏం ప‌ని? ఇప్పుడు ఎక్స్‌పోజింగ్(Exposing) కూడా ఎక్కువైపోయింది. మనల్ని ఎవ‌రూ ఏమీ అనొద్దు అనుకున్నా.. అంద‌రూ మ‌న‌ల్ని ఏదో ఒక‌టి అనేట్లుగానే మనం రెడీ అవుతున్నాం. ఎప్పుడూ ఎదుటివాళ్ల‌ది త‌ప్పు అన‌కూడ‌దు. మ‌న‌వైపు కూడా కొంచెం ఉంటుంది' అని అన్నపూర్ణమ్మ అన్నారు. ఇప్పుడా వీడియో క్లిప్పింగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) షేర్ చేస్తూ త‌న వ్యాఖ్య‌ల‌ను ఖండించారు ప్రముఖ గాయని చిన్మ‌యి శ్రీపాద(Chinmayi Sripada). తాను అన్నపూర్ణకు పెద్ద అభిమానినని, ఆమె ఇలాంటి అభిప్రాయాలు వ్య‌క్త‌ప‌రుస్తుంటే తన గుండె ముక్క‌లైన‌ట్లు అనిపిస్తోందని చిన్మయి వ్యాఖ్యానించారు. ఫేవ‌రెట్ అనుకున్న‌వాళ్లు ఇలా మాట్లాడుతుంటే త‌ట్టుకోలేక‌పోతున్నానన్నారు. 'అన్నపూర్ణ చెప్పిన‌దాని ప్ర‌కారం.. ఏదైనా హెల్త్ ఎమ‌ర్జెన్సీ(Health Emergency) వ‌చ్చినా, యాక్సిడెంట్ అయినా సూర్యోద‌యం, సూర్యాస్త‌మ‌యానికి మ‌ధ్య‌లోనే జ‌ర‌గాలి. ఆ త‌ర్వాత లేడీ డాక్ట‌ర్స్‌, న‌ర్సులు ఉండ‌కూడ‌దు' అని చిన్మయి శ్రీపాద తెలిపారు. 'మ‌నంద‌రికీ ఏదైనా ఎమ‌ర్జెన్సీ వ‌చ్చి ఆస్ప‌త్రికి వెళ్లినా ఆమె చెప్పిన‌ట్లు రాత్రిపూట మ‌హిళా డాక్ట‌ర్లే ఉండొద్దు. సాయంత్రం ఆరు గంట‌ల నుంచి ఉద‌యం ఆరు గంట‌ల వ‌ర‌కు మ‌గ డాక్ట‌ర్లే ఉంటారు. కాబ‌ట్టి ఒంట్లో బాగోలేక‌పోయినా రాత్రి ఆస్ప‌త్రిలో ఉండ‌కూడ‌దు. ఆమె చెప్పిన రూల్ ప్ర‌కారం పిల్ల‌లు కూడా అర్ధ‌రాత్రి పుట్ట‌కూడ‌దు. ఎందుకంటే గైన‌కాల‌జిస్టులు ఉండ‌రు, ఉండ‌కూడ‌దు కాబ‌ట్టి! జోక్స్ ప‌క్క‌న‌పెడితే ఇంట్లో వాష్‌రూమ్స్(Washrooms) లేక‌ సూర్యోద‌యానికి ముందు పొద్దున్నే మూడు గంట‌ల‌కు లేచి పొలం గ‌ట్టుకు వెళ్తున్న ఆడ‌వాళ్లు ఇంకా ఉన్నారు.ఇప్ప‌టికీ చాలా ఊర్ల‌లో బాత్‌రూమ్‌లు లేవు. ఇలాంటి సంద‌ర్భాల్లో కూడా ఆడ‌వాళ్లు ఎప్పుడు వ‌స్తారా? వాళ్ల‌పై ఎప్పుడు అఘాయిత్యానికి పాల్ప‌డుదామా? అని ఎదురుచూస్తున్న‌వాళ్లు ఈ స‌మాజంలో లెక్కకు మించిన వారు ఉన్నారు. అయినా అమ్మాయిల వేష‌ధార‌ణ వ‌ల్లే ఈ అఘాయిత్యాలు జ‌రుగుతున్నాయ‌ని చెప్తున్నారు. భార‌త్‌లో అమ్మాయిలుగా పుట్ట‌డం మ‌న క‌ర్మ' అని ఆవేదనతో పాటు ఆగ్ర‌హాన్ని వ్యక్తం చేశారు చిన్మయి శ్రీపాద

Updated On 26 Feb 2024 1:12 AM GMT
Ehatv

Ehatv

Next Story