What Is Marriage : పెళ్లి ఎందుకు చేసుకుంటారు? ఓ స్టూడెంట్ ఏం చెప్పారంటే...!
పెళ్లి(Marriage) ఎందుకు చేసుకుంటారు? దీనికి పెళ్లి చేసుకున్నవారు ఓ సమాధానం చెబుతారు. చేసుకోబోయే వారు మరో రకంగా చెబుతాను. మన కష్టసుఖాలను, సుఖదు:ఖాలను పంచుకునే ఓ వ్యక్తి ఉండాలి కాబట్టి అని పెద్దలు చెబుతుంటారు. ఇదే ప్రశ్నను స్కూలు పిల్లలను(School Children) అడిగామనుకోండి.. వారు చెప్పే ఆన్సర్లు గమ్మత్తుగా ఉంటాయి. నవ్వు తెప్పిస్తాయి. అలాగే ఓ స్కూల్లో పిల్లలకు ఇదే ప్రశ్న అడిగారు.
పెళ్లి(Marriage) ఎందుకు చేసుకుంటారు? దీనికి పెళ్లి చేసుకున్నవారు ఓ సమాధానం చెబుతారు. చేసుకోబోయే వారు మరో రకంగా చెబుతాను. మన కష్టసుఖాలను, సుఖదు:ఖాలను పంచుకునే ఓ వ్యక్తి ఉండాలి కాబట్టి అని పెద్దలు చెబుతుంటారు. ఇదే ప్రశ్నను స్కూలు పిల్లలను(School Children) అడిగామనుకోండి.. వారు చెప్పే ఆన్సర్లు గమ్మత్తుగా ఉంటాయి. నవ్వు తెప్పిస్తాయి. అలాగే ఓ స్కూల్లో పిల్లలకు ఇదే ప్రశ్న అడిగారు. ఎగ్జామ్‌లో అడిగిన ప్రశ్నకు ఓ స్టూడెంట్ రాసిన ఆన్సర్ సోషల్ మీడియాలో(Social media) వైరల్ అవుతోంది. పెళ్లంటే ఏంటి?(What Is Marriage) అన్న ప్రశ్నకు పాపం ఆ స్టూడెంట్‌కు ఏం రాయాలో తెలియలేదు. మొత్తం మీద తనకు తోచింది రాశారు. 'నువ్వు పెద్ద అమ్మాయి అయ్యావు. ఇక మేము నీకు తిండి పెట్టలేము. నీకు తిండిపెట్టే అబ్బాయిను వెతుక్కో అని తల్లిదండ్రులు ఓ అమ్మాయికి చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఓ అబ్బాయిని కలుస్తుంది. ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా అంతే! ఇప్పుడు నువ్వు పెద్దవాడికి అయ్యావు. ఇక పెళ్లి చేసుకోమని అరుస్తుంటారు. అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు పరీక్షించుకుంటారు. సంతోషంగా ఉంటామని తెలుసుకున్న తర్వాత పరస్పరం పెళ్లికి ఒప్పుకుంటారు. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత కొన్ని చెత్త పనులు చేసి పిల్లలను కంటారు' అని రాసుకొచ్చారా విద్యార్థి. ఆ సమాధానం చూసి టీచర్ బిత్తరపోయారు. ఆ ఆన్సర్‌ను కొట్టేశారు. ఆ స్టూడెంట్‌కు సున్నా మార్కులు వేశారు. ఇప్పుడీ ఆన్సర్ షీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చదివిన వారు తెగ నవ్వేసుకుంటున్నారు. స్టూడెంట్ తెలివితేటలకు వంద మార్కులేస్తున్నారు. ఈ చిన్ని వయసులోనే జీవితాన్ని కాచి వడపోసిన ఆ స్టూడెంట్ మహా జ్ఞాని అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇది జీవితసత్యమని, పెద్దవాళ్లకంటే చిన్న పిల్లలే ఇలాంటి వాటిపై కరెక్ట్ అన్సర్లు ఇస్తుంటారని కొందరంటున్నారు.