Black mailing Old People : వృద్ధులపై వలపు వల విసురుతున్నారు... న్యూడ్ వీడియో కాల్స్‌తో లక్షలకు లక్షలు గుంజుతున్నారు
కేటుగాళ్ల వలపు వలలో చిక్కుకుని వృద్ధులు గిలగిలలాడుతున్నారు. పది మందికి తెలిస్తే పరువుపోతుందన్న భయంతో వారు అడిగినంతా ఇచ్చుకుని మనో వేదనకు గురవుతున్నారు. కేటుగాళ్లు వీళ్ల బలహీనతను ఆసరా చేసుకుని లక్షలకు లక్షలు గుంజుతున్నారు. న్యూడ్ వీడియో కాల్స్(Nude Video Calls) రికార్డు చేసి బెదిరించి, బ్లాక్ మెయిల్(Black mail) చేసి డబ్బులు రాబట్టడం వీళ్లకు రోజువారీ తంతుగా మారింది. ముందు వృద్ధులతో(Old People) పరిచయం పెంచుకుంటారు కిలేడీలు. వారితో వాట్సప్ చాటింగ్(chatting) చేస్తూ చనువు పెంచుకుంటారు.

Black mailing Old People
కేటుగాళ్ల వలపు వలలో చిక్కుకుని వృద్ధులు గిలగిలలాడుతున్నారు. పది మందికి తెలిస్తే పరువుపోతుందన్న భయంతో వారు అడిగినంతా ఇచ్చుకుని మనో వేదనకు గురవుతున్నారు. కేటుగాళ్లు వీళ్ల బలహీనతను ఆసరా చేసుకుని లక్షలకు లక్షలు గుంజుతున్నారు. న్యూడ్ వీడియో కాల్స్(Nude Video Calls) రికార్డు చేసి బెదిరించి, బ్లాక్ మెయిల్(Black mail) చేసి డబ్బులు రాబట్టడం వీళ్లకు రోజువారీ తంతుగా మారింది. ముందు వృద్ధులతో(Old People) పరిచయం పెంచుకుంటారు కిలేడీలు. వారితో వాట్సప్ చాటింగ్(chatting) చేస్తూ చనువు పెంచుకుంటారు. తర్వాత వీడియో కాల్స్‌తో ముగ్గులోకి దించుతారు. అటు పిమ్మట న్యూడ్ వీడియో కాల్స్‌తో(Video calls) బెదిరింపులకు దిగుతారు.
గత రెండు రోజుల్లో ఇలాంటి కేసులు రెండు నమోదయ్యాయి. మొత్తంగా ఇద్దరు బాధితులు(Victims) 23 లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు. హైదరాబాద్ నారాయణగూడకు(Narayanaguda) చెందిన 78 ఏళ్ల వృద్ధుడు సోషల్ మీడియాలో పోస్టింగులు చూస్తుంటాడు. నాలుగు రోజులు కిందట వీడియో కాల్ చేయాలంటూ గుర్తు తెలియని యువతి నుంచి వాట్సప్ కాల్ వచ్చింది. యువతి కోరినట్టే చేశాడా వృద్ధుడు. ఆ దృశ్యాలన్నింటినీ ఆమె తెలివిగా రికార్డు చేసింది. తాము అడిగినంత సొమ్ము ఇవ్వకపోతే వీడియోను స్నేహితులకు, బంధువులకు పంపిస్తామని బెదిరించింది. దీంఓ 15 లక్షలు పంపించాడు. అక్కడితో ఆగని యువతి మరో అయిదు లక్షలు డిమాండ్ చేసింది. అంత డబ్బు ఇచ్చుకోలేని ఆ వృద్ధుడు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల కిందట ఇలాగే ఓ వృద్ధుడి నుంచి ఎనిమిది లక్షలు గుంజారు. ఈయన కూడా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
