✕
Sara Tendulkar : రాజస్తాన్ డిప్యూటీ సీఎం దియా ఇంట్లో సందడి చేసిన సారా..!
By EhatvPublished on 15 Dec 2023 7:58 AM GMT
సారా టెండూల్కర్..(Sara Tendulkar) భారత ప్రఖ్యాత క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కూతురు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ మధ్య సారా టెండూల్కర్ జైపూర్ సందర్శించింది. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఓ అమెరికన్(American) ఫ్యాషన్ కంపెనీ ఈవెంట్లో పాల్గొనేందుకు సారా జైపూర్ వెళ్లింది.

x
sara tendulkar
-
- సారా టెండూల్కర్..(Sara Tendulkar) భారత ప్రఖ్యాత క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కూతురు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ మధ్య సారా టెండూల్కర్ జైపూర్ సందర్శించింది. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఓ అమెరికన్(American) ఫ్యాషన్ కంపెనీ ఈవెంట్లో పాల్గొనేందుకు సారా జైపూర్ వెళ్లింది.
-
- జైపూర్(Jaipur) చేరుకున్న వెంటనే సారా స్థానికంగా ఉన్న రాంబాగ్ హోటల్లో(Rambagh Hotel) బస చేసింది. జైపూర్‌లోని అందమైన అన్ని ప్రదేశాలను సందర్శించింది. ఆ తర్వాత జైపూర్ నడిబొడ్డున ఉన్న సిటీ ప్యాలేస్‌ను(City Palace) సారా సందర్శించింది. రాజస్తాన్ డిప్యూటీ సీఎం ఉంటున్న సిటీ ప్యాలెస్‌లో సందర్శించి సెల్ఫీలు తీసుకుంది. ఈ సిటీ ప్యాలెస్‌లో దియా కుమారి(Diya Kumari) సహా ఆమె ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉంది. ఈ సందర్భంగా దియాకుమారి కూతురు గౌరవి కుమారికి(Gouravi Kumari) సారా ధన్యావాదాలు తెలిపింది.
-
- అయితే సోషల్ మీడియాలోనే(Social Media) కాదు.. రియల్ లైఫ్‌లో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. గత కొంత కాలంగా భారత స్టార్ క్రికెట్ శుభ్‌మన్ గిల్‌తో(Shubman Gill) రిలేషన్షిప్ కొనసాగిస్తుందంటూ వీరిద్దరిపై పుంకానుపుంకాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై సారా అసహనం వ్యక్తం చేసింది. తన పేరుతో నకిలీ ఖాతాలన్నింటినీ బంద్ చేయాలంటూ డిమాండ్(Demand) చేసింది.
-
- ఈ మధ్యనే ట్విట్టర్లో(Twitter) శుభ్‌మన్‌గిల్‌తో ఉన్న సారా మరో ఫోటో వైరలైంది. శుభ్‌మన్‌గిల్, సారా టెండూల్కర్ ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నట్లు ట్విట్టర్లో వైరలైంది. ఆ తర్వాత ఇది డీప్‌ఫేక్(Deep fake) అని తెలిసింది. ఈ ఫొటోలో తన పక్కన కూర్చున్నది శుభ్‌మన్‌గిల్ కాదని తన సోదరుడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) అని నిర్ధారణైంది.

Ehatv
Next Story