భారత క్రికెట్ జట్టు బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ తన ఆటతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్త‌ల‌లో నిలుస్తూనే ఉన్నాడు. శుభమాన్ గిల్.. నటి సారా అలీ ఖాన్‌తో పాటు సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో రిలేష‌న్‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ విషయంపై ఎవ‌రూ ఇప్పటివరకు స్పందించ‌క‌పోవ‌డంతో.. అన్ని ఒట్టి పుకార్లు అన్ని కొట్టిపారేసేవారు కూడా ఉన్నారు.

భారత క్రికెట్ జట్టు బ్యాట్స్‌మెన్(Team India Cricketer) శుభ్‌మన్ గిల్ తన ఆటతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్త‌ల‌లో నిలుస్తూనే ఉన్నాడు. శుభమాన్ గిల్.. నటి సారా అలీ ఖాన్‌తో పాటు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కుమార్తె సారా టెండూల్కర్‌(Sara Tendulkar)తో రిలేష‌న్‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ విషయంపై ఎవ‌రూ ఇప్పటివరకు స్పందించ‌క‌పోవ‌డంతో.. అన్ని ఒట్టి పుకార్లు అన్ని కొట్టిపారేసేవారు కూడా ఉన్నారు. సోషల్ మీడియా(Social Media)లో కొన్ని చిత్రాలు వైరల్ అవుతున్నాయి. దీని కారణంగా సారా అలీ ఖాన్(Sara Ali Khan), శుభమాన్ గిల్ డేటింగ్(Dating) చేస్తున్నారని ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి.

సారా అలీ ఖాన్(Sara Ali Khan), శుభ్‌మాన్ గిల్(Shubman Gill) విమానాశ్రయంలో కనిపించారు. ఈ ఫోటోలో సారా.. శుభ్‌మన్ గిల్‌తో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటోలు పాతవే అయినా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటో చూసిన అభిమానులు ఎప్పటికపుడు కామెంట్స్ చేస్తున్నారు. శుభ్‌మన్ గిల్‌ మ్యాచ్ చూసేందుకు సారా మైదానానికి ఎందుకు రాలేదని కొందరు అంటున్నారు. ఈ ఫోటో వైరల్ అయిన తర్వాత.. సారా క్రికెటర్ మ్యాచ్ చూడటానికి లక్నో(Lucknow)కు వెళ్లిందని.. అయితే ఈ ఫోటో ముంబై(Mumbai)కి చెందినదని.. అది చాలా పాతదని అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక శుభమాన్ గిల్(Shubman Gill).. సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో కూడా రిలేష‌న్‌లో ఉన్నాడ‌నే వార్త‌లు ఉన్నాయి. గ‌తంలో ఒక వీడియో వైరల్ అయ్యింది. అందులో శుభమాన్ గిల్ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు. అభిమానులు సారా సారా అంటూ నినాదాలు చేశారు. ఈ విష‌య‌మై శుభమాన్ గిల్ ఎటువంటి కామెంట్ చేయ‌లేదు. అయితే కొన్ని నెలల క్రితం గిల్ ఒక టాక్ షోలో త‌ను సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నానని సోనమ్ బజ్వాకు హింట్ ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు. ముగ్గురిలో ఎవ‌రో ఒక‌రు ఈ విష‌యంపై స్పందించే వ‌ర‌కూ ఈ టాఫిక్ ఇలాగే కొన‌సాగేలా ఉంది. ఎవ‌రో ఒక‌రు రూమ‌ర్ల‌కు ఎండ్ కార్డ్ వేస్తే బాగుంటుద‌ని నెటిజ‌న్లు భావిస్తున్నారు.

Updated On 19 April 2023 10:05 PM GMT
Yagnik

Yagnik

Next Story