Samantha : పెళ్లి అనేది ఓ బ్యాడ్ ఇన్వెస్ట్‌మెంట్.. అవసరమా చెప్పండి?
సోషల్ మీడియాలో సమంత(Samantha) చాలా యాక్టివ్‌గా ఉంటారు. మిగతా హీరోయిన్ల కంటే సమంతకే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అందరితో పంచుకుంటుంటారు. చెప్పుకోవడానికి ఏమీ లేకపోతే కనీసం ఫోటోలో, వీడియోలో(Videos) పోస్టు చేస్తుంటారు. ఇటీవల తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) చిట్‌చాట్ నిర్వహించారు సమంత.
సోషల్ మీడియాలో సమంత(Samantha) చాలా యాక్టివ్‌గా ఉంటారు. మిగతా హీరోయిన్ల కంటే సమంతకే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అందరితో పంచుకుంటుంటారు. చెప్పుకోవడానికి ఏమీ లేకపోతే కనీసం ఫోటోలో, వీడియోలో(Videos) పోస్టు చేస్తుంటారు. ఇటీవల తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) చిట్‌చాట్ నిర్వహించారు సమంత. అందులో నెటిజన్లు అడిగిన అనేకానేక వింత ప్రశ్నలకు ఇరిటేట్ కాకుండా అంతే వింతగా జవాబులు చెప్పారు. మీరు మళ్లీ పెళ్లి గురించి ఎందుకు ఆలోచించరు? అంటూ ఓ నెటిజన్ అడిగారు. దానికి సమంత చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. విడాకులకు(Divorce) సంబంధించిన తాజా గణాంకాలను అతడికి చూపించారు. పెళ్లి అనేది బ్యాడ్ ఇన్వెస్ట్‌మెంట్(Bad investment) అని చెబుతూ అది అవసరమా చెప్పండి అని స్మైలీ ఎమోజీని కూడా ఆ కామెంట్‌తో జత చేశారు సమంత. 2023లో విడిపోయిన దంపతులు 50 శాతం మంది ఉన్నారు. రెండోసారి పెళ్లి చేసుకుని విడిపోయినవాళ్లు 67 శాతం మంది ఉన్నారు. ఇక మూడోసారి పెళ్లి చేసుకుని విడాకులు పుచ్చుకున్నవారు 73 శాతం మంది ఉన్నారు. ఈ గణాంకాలనే సమంత ఆ నెటిజన్‌కు చూపించారు.