Khushi Kapoor : ఖుషీ కపూర్, వేదాంగ్ మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్
అతిలోకసుందరి శ్రీదేవి(Sridevi) కూతురు జాన్వీ కపూర్ సినీ ఇండస్ట్రీలో తల్లికి తగిన తనయగా పేరు సంపాదించింది. బాలీవుడ్‌లో(Bollywood) ఇప్పటికే క్రేజ్‌ను సంపాదించుకున్న జాన్వీ కపూర్ దేవర సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఎన్టీఆర్ సరసన నటిస్తున్న జాన్వీ ఎక్కువగా హిందీ సినిమాల్లోనే నటిస్తోంది. ఇప్పుడు ఆమె చెల్లెలు కూడా అక్క బాటలోనే పయనిస్తోంది. శ్రీదేవి చిన్న కూతురు అయిన ఖుషీ కపూర్(Khushi kapoor) ప్రేక్షకులను పలకరించింది.
అతిలోకసుందరి శ్రీదేవి(Sridevi) కూతురు జాన్వీ కపూర్ సినీ ఇండస్ట్రీలో తల్లికి తగిన తనయగా పేరు సంపాదించింది. బాలీవుడ్‌లో(Bollywood) ఇప్పటికే క్రేజ్‌ను సంపాదించుకున్న జాన్వీ కపూర్ దేవర సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఎన్టీఆర్ సరసన నటిస్తున్న జాన్వీ ఎక్కువగా హిందీ సినిమాల్లోనే నటిస్తోంది. ఇప్పుడు ఆమె చెల్లెలు కూడా అక్క బాటలోనే పయనిస్తోంది. శ్రీదేవి చిన్న కూతురు అయిన ఖుషీ కపూర్(Khushi kapoor) ప్రేక్షకులను పలకరించింది. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ది ఆర్చీస్(Archie's) సినిమాతో అరంగ్రేట్ చేసింది. డిసెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) స్ట్రీమింగ్ అవుతోంది. సినిమాల్లో అలా అడుగుపెట్టిందో లేదో అప్పుడే ఆమెపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ది ఆర్చీస్‌లో తనతో పాటు నటించిన వేదాంగ్ రైనాతో(Vedang raina) డేటింగ్‌లో ఉందంటూ బాలీవుడ్‌లో అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే వేదాంగ్ రైనా మాత్రం ఈ వార్తలను ఖండించారు. ఖుషీ కపూర్, తాను చాలా సందర్భాలలో కనెక్ట్ అయ్యామని, సంగీతంలో తమ ఇద్దరి అభిరుచులు ఒకేలా ఉన్నాయని వేదాంగ్ అన్నాడు. అలాగని తామిద్దరం డేటింగ్(Dating) చేయడం లేదని, ఆమెతో తనకు చాలా రోజుల నుంచి పరిచయం ఉందని అన్నారు. ఇద్దరి మధ్య స్ట్రాంగ్ ఫ్రెండ్‌షిప్ ఉందని, ప్రస్తుతానికి తాను సింగిల్‌గానే ఉన్నానని అన్నాడు. ఆ సమయం వస్తే తానే మీ ముందుకు వచ్చి చెబుతానని వేదాంగా వివరించాడు.