ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది కదా! ఇప్పటికే స్పోర్ట్స్ పర్సనాలిటీలపై బోల్డన్నీ బయోపిక్‌లు వచ్చాయి.
మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌కు కూడా బయోపిక్‌లో నటించాలని ఉందన్న కోరికను వెలిబుచ్చారు. ట్రిపులార్‌ మూవీతో గ్లోబల్‌ స్టార్‌గా మారిపోయిన చరణ్‌కు స్పోర్ట్స్ బయోపిక్‌లో నటించాలని ఉందన్నారు.

ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది కదా! ఇప్పటికే స్పోర్ట్స్ పర్సనాలిటీలపై బోల్డన్నీ బయోపిక్‌లు వచ్చాయి.
మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌కు కూడా బయోపిక్‌లో నటించాలని ఉందన్న కోరికను వెలిబుచ్చారు. ట్రిపులార్‌ మూవీతో గ్లోబల్‌ స్టార్‌గా మారిపోయిన చరణ్‌కు స్పోర్ట్స్ బయోపిక్‌లో నటించాలని ఉందన్నారు. అవకాశం వస్తే టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటించాలని ఉందంటూ తన మనసులోని మాట బయటపెట్టారు.

వర్తమాన క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీకి మించిన క్రికెటర్‌ లేడన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ మాటే రామ్‌చరణ్‌ చెబుతూ ఆయనది స్ఫూర్తిదాయకమైన క్యారక్టర్‌ అని ప్రశంసించారు. కోహ్లీ పాత్ర ధరించే ఛాన్స్‌ వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని చెర్రీ అన్నారు. అదీ కాకుండా కోహ్లీకి తనకు దగ్గర పోలికలు ఉంటాయని, ఇది కూడా తనకు అదనపు అడ్వాంటేజ్‌ అవుతుందని చరణ్‌ పేర్కొన్నారు. మొదట్నుంచి రామ్‌చరణ్‌ కెరీర్‌ను చక్కగా ప్లాన్‌ చేసుకుంటూ వస్తున్నారు. డిఫరెంట్‌ పాత్రలను ఎన్నుకుంటున్నారు. నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. విజయం సాధిస్తున్నారు. ప్రజెంట్‌ స్పోర్ట్స్ బయోపిక్‌ చేయాలని ఉందన్న కోరికను వెలిబుచ్చటంతో ఫ్యాన్స్‌ తెగ ఆనందపడుతున్నారు. కాంక్లేవ్‌ సందర్భంగా చరణ్‌.. ఆస్కార్‌ విన్నింగ్‌ నాటు నాటు పాటకు స్టెప్పులేసి అలరించాడు. ఇదిలా ఉంటే ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో గ్రౌండ్‌లో విరాట్‌ కోహ్లీ నాటునాటు పాటకు స్టెప్పులేని ప్రేక్షకులను అలరించారు. ఓ రకంగా చరణ్‌ ప్రపోజల్‌కు ఇది సూచనప్రాయ అంగీకారమేనని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. అమెరికా ఆస్కార్‌ వేడుకల్లో పాల్గొన్న రామ్‌చరణ్‌ అట్నుంచి అటే నేరుగా ఢిల్లీకి వచ్చారు. తండ్రి చిరంజీవితో కలిసి కేంద్రమంత్రి అమిత్‌ షాను కలుసుకున్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డు లభించినందుకు రామ్‌చరణ్‌ను అమిత్‌ షా అభినందించారు. శాలువా కప్పి సత్కరించారు.

తండ్రి చిరంజీవితో కలిసి కేంద్ర మంత్రి అమిత్‌ షాను కలిశాడు. చరణ్‌ పాల్గొన్న కాంక్లేవ్‌లోనే పాల్గొన్న అమిత్‌ షా.. సదస్సు అనంతరం అదే హోటల్‌లో బస చేస్తున్న చరణ్‌ రూమ్‌ కి వెళ్లి కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా నాటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్నందుకు గానూ అమిత్‌షా అభినందించి చరణ్‌ను శాలువాతో సత్కరించారు. భేటి తర్వాత కేంద్ర మంత్రి అమిత్‌ షా ఇద్దరు స్టార్‌లను కలుసుకున్నందుకు ఆనందంగా ఉందని ట్వీట్‌ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ భారతదేశ సంస్కృతి, ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేసిందని ట్వీట్‌లో తెలిపారు.

Updated On 18 March 2023 12:39 AM GMT
Ehatv

Ehatv

Next Story