Rishab Shetty's Kantara Movie : కాంతార కు అరుదైన గౌరవం.... ఐరాసలో ప్రదర్శన
రిషబ్ శెట్టి పాన్ ఇండియా మూవీ కాంతార చిత్రాన్ని ఐక్యరాజ్యసమితి జెనీవా నగరంలోని కార్యాలయంలో ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. అక్కడ ప్రదర్శితమవుతున్న తొలి కన్నడ సినిమా ఇది.
గత ఏడాది విడుదలై భారీ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ సాధించిన దక్షిణాది చిత్రాల్లో ‘కాంతార’ ఒకటి.
రిషబ్ శెట్టి పాన్ ఇండియా మూవీ కాంతార చిత్రాన్ని ఐక్యరాజ్యసమితి జెనీవా నగరంలోని కార్యాలయంలో ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. అక్కడ ప్రదర్శితమవుతున్న తొలి కన్నడ సినిమా ఇది.
గత ఏడాది విడుదలై భారీ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ సాధించిన దక్షిణాది చిత్రాల్లో ‘కాంతార’ ఒకటి. పదహారు కోట్ల రూపాయల బడ్జెట్‌తోనే రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. విడుదలైన ప్రతీ భాషలోనూ సినిమా భారీ విజయాన్నే సాధించింది. ప్రేక్షకుల ఆదరణ పొందుతూనే వసూళ్ల పరంగా పలు రికార్డులను సాధించిన ఈ చిత్రం మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఇంతకీ విషయం ఏంటంటే .. ఐక్యరాజ్యసమితి హెడ్ ఆఫీస్ జెనీవా ఆఫీసులో ఈరోజు కాంతార సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు.
కాంతార సినిమా ప్రదర్శన అనంతరం ఆ సినిమాలో హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన రిషబ్ శెట్టి ప్రసంగిస్తారు. ఇప్పటికే ఆయన జెనీవా చేరుకున్నారు. ఈ అరుదైన గౌరవం తమ సినిమాకు దక్కటంపై రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు..సంతోషాన్ని వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భారతీయ సినిమాలు అనే అంశంపైనే రిషబ్ మాట్లాడబోతున్నారు. కాంతార సినిమాలోనూ ప్రకృతితో మనిషికి ఉన్న కనెక్షన్‌ను తెలియజేస్తుంది. తమ అడవి తమకు కావాలనే హీరో ఆయన గ్రామస్థులు విలన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు.
ఆసక్తికరమైన విషయమేమంటే ఐక్యరాజ్యసమితిలో ప్రదర్శితమవుతున్న తొలి కన్నడ చిత్రంగా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. ఇది నిజంగా గొప్ప విషయమే. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా కాంతార 2 సినిమాను రూపొందిస్తున్నారు. ప్రీక్వెల్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రిషబ్ శెట్టి బిజీగా ఉన్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. సప్తమిగౌడ హీరోయిన్‌గా నటించింది. కర్ణాటకలో భూతకోలా సంస్కృతి, సంప్రదాయాలపై కాంతార సినిమాను రూపొందించారు.
మరోవైపు తన సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడంతో పాటు సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాంతార సినిమా ప్రకృతి ప్రసాదించిన అడవుల రక్ణణ గురించి ప్రస్తావించిన కాంతార చిత్రం ప్రపంచ స్థాయిలో ప్రదర్శించబోవడం నిజంగా గొప్ప విషయం అని ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ రాసుకున్నారు. దీనికి పలు ఫోటొలు జత చేశారు. ప్రస్తుతం ఈ ఫోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా తక్కువ బడ్జెట్ తో రూపొందిన కాంతార వందల కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే .