ఫ్రాన్స్‌(France) ఇంకా మండుతూనే ఉంది. వారం రోజులు గడిచినా హింస తగ్గలేదు. ఫ్రాన్స్‌లో హింస ప్రజ్వరిల్లుతోంది. పోలీసు కాల్పుల్లో(Police Shoot Out) 17 ఏళ్ల యువకుడు చనిపోయిన ఘటన ఫ్రాన్స్‌ను అల్లకల్లోలం చేస్తున్నదన్న విషయం తెలిసిందే. వారం రోజులవుతున్నా ఇంకా అక్కడ ఉద్రిక్తత తగ్గుముఖం పట్టలేదు.

ఫ్రాన్స్‌(France) ఇంకా మండుతూనే ఉంది. వారం రోజులు గడిచినా హింస తగ్గలేదు. ఫ్రాన్స్‌లో హింస ప్రజ్వరిల్లుతోంది. పోలీసు కాల్పుల్లో(Police Shoot Out) 17 ఏళ్ల యువకుడు చనిపోయిన ఘటన ఫ్రాన్స్‌ను అల్లకల్లోలం చేస్తున్నదన్న విషయం తెలిసిందే. వారం రోజులవుతున్నా ఇంకా అక్కడ ఉద్రిక్తత తగ్గుముఖం పట్టలేదు. ఆందోళనకారులు(Agitators) పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చిన ప్రభుత్వ ఆస్తులను తగలబెడుతున్నారు. దుకాణాలను లూటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ అల్లర్లలో సుమారు వెయ్యిమందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పోలీసు బలగాలలో 200 మందికిపైగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అహర్నిషం శ్రమిస్తున్నారు. సుమారు 45 వేల మంది పోలీసులు పహారా కాస్తూ అల్లరి మూకలను చెదరగొడుతున్నారు. అయినా ఉద్రిక్తతలు మాత్రం చల్లారడం లేదు. ఇదిలాఉంటే, పారిస్‌(Paris) నగరంలో ఆందోళనకారులు బీభత్సం సృష్టిస్తున్నారు. ఎక్కడికక్కడ షాపులలో చొరబడి చేతికందని వస్తువులను దోచుకుంటున్నారు. ఇక్కడ వోక్స్‌ వ్యాగన్‌(Volkswagen) కార్‌ షోరూమ్‌ను(car show room) కూడా కొల్లగొట్టారు. అందులో ఉన్న ఖరీదైన కార్లను ఎత్తుకెళ్లారు. దుండగులు కార్లను ఎత్తుకెళుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Updated On 3 July 2023 7:06 AM GMT
Ehatv

Ehatv

Next Story