Revanth Camp Office: రేవంత్‌రెడ్డి కొత్త క్యాంప్ ఆఫీస్‌గా యూఎస్ కాన్సులేట్ పాత భవనం..!
తెలంగాణలో (Telangna) కొత్త సర్కార్ కొలువుదీరిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) క్యాంప్ ఆఫీస్‌పై చర్చ కొనసాగుతోంది. కేసీఆర్ (KCR) నిర్మించిన ప్రగతిభవన్ ఇప్పటి ప్రజాభవన్‌లో (Prajabhavan) ఉండడం ఇష్టం లేక ఆయన మరో భవనం కోసం వెతుకుతున్నారు.
తెలంగాణలో (Telangna) కొత్త సర్కార్ కొలువుదీరిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) క్యాంప్ ఆఫీస్‌పై చర్చ కొనసాగుతోంది. కేసీఆర్ (KCR) నిర్మించిన ప్రగతిభవన్ ఇప్పటి ప్రజాభవన్‌లో (Prajabhavan) ఉండడం ఇష్టం లేక ఆయన మరో భవనం కోసం వెతుకుతున్నారు. ప్రజాభవన్‌లో ఉన్న భవనాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ( Deputy CM Bhatti Vikramarka), మరో మంత్రి సీతక్కకు (Minister Seethakka) కేటాయించారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో (MCHRD) తాత్కాలికంగా సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయం, ఇంటి నుంచే పరిపాలన చేస్తున్న సీఎం రేవంత్‌కు ఇప్పుడు కొత్త ఆలోచన వచ్చిందట. తాజాగా ఆయన క్యాంప్ ఆఫీస్‌ను బేగంపేటలో ఉన్న అమెరికా కాన్సులేట్ (US Consulate) పాత భవనానికి మార్చుతారని వార్తలు వస్తున్నాయి. రాజసం ఉట్టిపడేలా ఉండే ఈ భవనంలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంటే ఆ దర్జానే వేరని రేవంత్‌కు పలువురు సూచిస్తున్నారట. దీంతో ఆయన కూడా ఆ భవనంలోకి మారేందుకు సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. త్వరలోనే రేవంత్ ఈ భవనంలోకి మారే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి.