పైసలిచ్చుకో.. కౌగిలించుకో..! రిలీఫ్‌గా ఉండు..!
పైసలిచ్చుకో.. కౌగిలించుకో..! రిలీఫ్‌గా ఉండు..!

ఈ రోజుల్లో చాలా మంది యువకులు ఉద్యోగాల కోసం ఇంటి నుంచి దూరంగా నగరాలకు వెళ్తారు, అక్కడ వాళ్లకు ఎమోషనల్ సపోర్ట్ తక్కువగా ఉంటుంది. ఉరుకులు, పరుగుల జీవితంలో వారు స్వాంతన కోరుకుంటారు. అలాంటి వారికోసమే కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. అదే అద్దె కౌగిలింత. ఇది ఒక వింత ట్రెండ్‌లా అనిపించినా.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల ఇలాంటి సర్వీసులు వైరల్‌గా మారాయి. జపాన్‌లో "కడిల్ కేఫ్‌లు" అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అక్కడ కస్టమర్లు కొంత డబ్బు చెల్లించి, ఎవరితోనైనా కౌగిలించుకోవచ్చు లేదా కాసేపు చూస్తూ కూర్చోవచ్చు. ఇది ఒంటరితనం ఎక్కువగా ఉన్నవాళ్లకు ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడానికి ఒక మార్గంగా ఉంటుంది. భారతదేశంలో ప్రొఫెషనల్ కడ్లింగ్ అనేది ఇంకా పెద్ద స్థాయిలో ట్రెండ్ కాలేదు, కానీ ఇటీవల కొన్ని మెట్రో సిటీల్లో ఈ కాన్సెప్ట్ గురించి చర్చిస్తన్నారు. ఇది ప్రధానంగా ఒంటరితనం, ఒత్తిడి, లేదా ఎమోషనల్ సపోర్ట్ కోసం చూసే వాళ్ల కోసం ఒక థెరపీగా పరిగణించబడుతోంది. కొంతమంది ప్రొఫెషనల్ కడ్లర్స్ లేదా టచ్ థెరపిస్ట్‌లు ముంబై, బెంగళూరు, పుణె, హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో తమ సర్వీసులను అందిస్తున్నట్టు తెలుస్తోంది. ముంబైలో ఒక ఇంటిమసీ కోచ్ అయిన ఐలీ సెగ్హెట్టి ఇలాంటి సర్వీసులను ఆఫర్ చేస్తున్నట్టు తెలిసింది, బెంగళూరులో కూడా కొంతమంది కడ్లర్స్ ఉన్నారని సమాచారం. ఈ సర్వీస్ ధరలు సాధారణంగా గంటకు 1000 నుంచి 7000 రూపాయల వరకు ఉండొచ్చు, అది కూడా స్థలం, కడ్లర్ అనుభవం, సర్వీస్ రకం బట్టి మారుతుంది. ఒక గంట కౌగిలి కోసం 2000-3000 రూపాయలు ఛార్జ్ చేసే వాళ్లు ఉన్నారు. అయితే, ఇది పూర్తిగా నాన్-సెక్షువల్, ప్లాటోనిక్ థెరపీగా ఉంటుందని, క్లయింట్‌లు దుస్తులు ధరించే ఉంటారు. కొందరు ఆఫర్ ప్యాకేజీలు కూడా ఇస్తున్నారు. 2 గంటల పాటు ఉంటే 4000 లేదా ఓవర్‌నైట్ సెషన్‌కు 10,000 రూపాయల వరకు చార్జీ వేస్తున్నారు.
ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో బాగా పాపులర్ అయిన తర్వాత, భారతదేశంలో కూడా కొన్ని పెద్ద నగరాల్లో ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ స్టార్ట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. కొంతమంది వ్యక్తులు లేదా చిన్న గ్రూప్‌లు ఈ సర్వీస్‌ను వ్యక్తిగతంగా ఆఫర్ ర్ ఇస్తున్నారు. భారతదేశంలో ఇలాంటి సర్వీస్‌లు ఎక్కువగా మహిళలు ఆఫర్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది సాధారణంగా ఫ్రీలాన్స్ ప్రొఫెషనల్స్ లేదా చిన్న స్టార్టప్‌ల ద్వారా నడుస్తోంది. కొంతమంది సైకాలజీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లు దీన్ని థెరపీలా ఆఫర్ చేస్తున్నారు. ఈ సర్వీస్ పూర్తిగా నాన్-సెక్షువల్‌గా ఉంటుంది. క్లయింట్‌లు పూర్తి దుస్తుల్లో ఉంటారు, కడ్లర్ స్పష్టమైన షరతులు పెడతారు. ఇది రెండు పక్షాలకు సౌలభ్యంగా ఉండేలా చూస్తుంది. వెనక నుంచి కౌగిలించడ), హ్యాండ్-హోల్డింగ్, షోల్డర్‌పై తల పెట్టడం, లేదా సింపుల్‌గా పక్కపక్కన కూర్చోవడం వంటివి ఇందులో ఉంటాయి. కౌగిలించుకోవడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ అనే "ఫీల్-గుడ్" హార్మోన్ విడుదల అవుతుంది. ఇది కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్‌ను తగ్గిస్తుంది. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆందోళన కూడా తగ్గుతుంది. రోజూ ఒత్తిడితో బాధపడేవాళ్లకు ఇది చాలా ఉపయోగకరం. కడ్లింగ్ వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది, పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. దీని వల్ల నీవు రాత్రి హాయిగా నిద్రపోగలవు.. నిద్రలేమితో ఇబ్బంది పడేవాళ్లకు ఇది సహజమైన సొల్యూషన్‌లా పనిచేస్తుంది. నగరాల్లో చాలా మంది ఒంటరిగా ఉంటారు.. కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉంటారు. ఇలాంటి వాళ్లకు కడ్లింగ్ ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇస్తుంది. మానవ స్పర్శ వల్ల ఆప్యాయంగా అనిపిస్తుంది, దీని వల్ల ఒంటరితనం తగ్గి మనసు ఆనందంగా ఉంటుంది. ఆక్సిటోసిన్ విడుదల కావడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం రెగ్యులర్‌గా కౌగిలింతలు పొందే వాళ్లు సాధారణ జలుబు లాంటి వ్యాధులకు తక్కువగా గురవుతారు. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
కడ్లింగ్ వల్ల స్ట్రెస్ తగ్గడం మూలంగా రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. ఒత్తిడి తగ్గితే హార్ట్ రేట్ స్టెడీగా ఉంటుంది, దీని వల్ల దీర్ఘకాలంలో గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. శరీరంలో నొప్పి ఉన్నప్పుడు కౌగిలి ఒక సహజ నొప్పి నివారిణిలా పనిచేస్తుంది. ఆక్సిటోసిన్ విడుదల వల్ల నొప్పి తీవ్రత తగ్గుతుంది, ముఖ్యంగా కండరాల నొప్పి లేదా తలనొప్పి ఉన్నవాళ్లకు ఇది ఉపశమనం ఇస్తుంది. డిప్రెషన్, ఆందోళన లాంటి మానసిక సమస్యలతో బాధపడేవాళ్లకు కడ్లింగ్ ఒక థెరపీలా పనిచేస్తుంది. ఇది సెరోటోనిన్, డోపమైన్ లాంటి హ్యాపీ హార్మోన్స్‌ను కూడా విడుదల చేస్తుంది, దీని వల్ల మూడ్ మెరుగుపడుతుంది. ఇది పెయిడ్ సర్వీస్ అయినప్పటికీ, క్లయింట్‌కు కడ్లర్‌తో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది. ఈ అనుభవం వాళ్లను రియల్ లైఫ్‌లో ఇతరులతో బెటర్ రిలేషన్స్ బిల్డ్ చేసుకోవడానికి సహాయపడుతుంది. కొందరికి ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్‌లా పనిచేస్తుంది.
